డేటింగ్ యాప్‌ లో పరిచయమై.. బ్లాక్‌ మెయిల్ చేసి రూ. 5 కోట్లు వసూలు.. హైదరాబాద్ లో హైటెక్ మోసం

ఇటీవలి కాలంలో సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. సామాజిక మాధ్యమాల్లో గంటల తరబడి గడపడం అటు పిల్లల నుంచి ఇటు పెద్దల వరకూ మామూలుగా మారిపోయింది. అలాగే నగదు ట్రాన్స్ ఫర్ కూడా ఇప్పుడే ఆన్ లైన్ ద్వారానే చేస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ లాంటి మహానగరాల్లో హైటెక్ మోసాలకు తెరతీశారు కొందరు కేటుగాళ్లు. ఇక ఇటీవల హైదరాబాద్‌ కు చెందిన ఒక యువ న్యాయవాదిని డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన ఒక వ్యక్తి ఏకంగా రూ.5 కోట్లు బ్లాక్‌ మెయిల్ చేసి వసూలు చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

డేటింగ్ యాప్స్ అనగానే చాలా మంది యువత ఆసక్తి చూపిస్తుంటారు. కానీ ఇవి ఎంత ప్రమాదకరమో ఈ ఘటన చూస్తే స్పష్టం అవుతోంది. ఆ యువ న్యాయవాది డేటింగ్ యాప్ లో వచ్చే బెదిరింపులను భరించలేక కుటుంబ సభ్యుల ఖాతాల్లోని డబ్బులతో పాటు ఏకంగా తన ఫ్లాట్‌ ను కూడా అమ్మి మొత్తం 241 విడతల్లో నగదు బదిలీ చేశాడు. ఇక ఎట్టకేలకు బాధితుడు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోను సంప్రదించడంతో వాళ్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డేటింగ్ యాప్స్ ద్వారా ఎంజాయ్ చేయాలనుకునే యువత చాలా అప్రమత్తంగా ఉండాలని ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని పోలీసులు పలు సూచనలు చేస్తున్నారు.

ఏం జరిగిందంటే..?

పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ లోని హైటెక్ సిటీకి చెందిన ఓ 27 ఏళ్ల న్యాయవాదికి గతేడాది ఆగస్టులో ఓ ఆన్ లైన్ డేటింగ్ యాప్ ద్వారా దిశ అనే పేరుతో ఒకరు పరిచయం అయింది. తాను ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి అని మాయమాటలు చెప్పడంతో ఆ న్యాయవాది నమ్మేశాడు. దాంతో ఇద్దరి మధ్య చాటింగ్ కొన్నాళ్లపాటు సాగింది. అలా నమ్మకం కలిగాక తన తండ్రి చనిపోయాడని అంత్యక్రియలకోసం నగదు కావాలంటూ రూ. 4.38 లక్షలను వసూలు చేసింది.

Hyderabad Meeting via a dating app 5 crore extorted through blackmail Hi-tech fraud in Hyderabad

ఆ తర్వాత కూడా పలుమార్లు డబ్బులు ఇవ్వాలంటూ వేధించసాగింది. దాంతో తాను ఇవ్వనని న్యాయవాది స్పష్టం చేశాడు. ఇక తన అసలు రంగు బయట పెట్టింది. తాను ఓ ట్రాన్స్ జెండర్ అని తన పేరు ఎలీనా అని డబ్బులు ఇవ్వకపోతే బాధితుడి చాట్స్ బహిర్గతం చేస్తానని బెదిరింపులకు పాల్పడింది. అంతేకాక ట్రాన్స్ జెండర్స్ తో ఇంటికి వచ్చి పరువు తీస్తామంటూ బ్లాక్ మెయిల్ చేసింది. అలా గతేడాది ఆగస్టు 2 నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ 15 వరకు దాదాపు 241 ఆన్‌ లైన్ ట్రాన్సాక్షన్స్ ద్వారా ఏకంగా రూ.4.91 కోట్లు బదిలీ చేశాడు. అలా తన ఫ్యామిలీ వద్ద ఉన్న డబ్బులు.. తన ఫ్లాట్ కూడా అమ్మేసి డబ్బలు ఇచ్చాడు. ఇక భరించలేక పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టింది. ప్రస్తుతం నిందితుడి కోసం గాలింపు చర్యలు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+