16 ఏళ్ల కష్టానికి నేనే సాక్ష్యం.. ది ప్యారడైజ్ రిలీజ్ వేళ నాని వైఫ్ ఎమోషనల్!

Nani : నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా 'ది ప్యారడైజ్'. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. 'దసరా' తర్వాత వీరిద్దరూ మరోసారి కలిసి పనిచేయడంతో సినిమాపై మొదటి నుంచే ఆసక్తి నెలకొంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో నాని ఇప్పటివరకు చూడని విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాకు సెప్టెంబర్ 23 నుంచే తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యాయి. ఓవర్సీస్‌లోనూ ప్రీమియర్లు జరుగుతున్నాయి. ఈ తరుణంలో హీరో నాని భార్య అంజనా చేసిన ఓ ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Varanasi: రాజమౌళి సంచలన నిర్ణయం.. మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు నిరాశ తప్పదా?
Varanasi: రాజమౌళి సంచలన నిర్ణయం.. మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు నిరాశ తప్పదా?

నేచురల్ స్టార్ నాని సినీ ప్రయాణం ఒక్కరోజులో ఏర్పడిన స్టార్‌డమ్ కాదు. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. చిన్న చిన్న అవకాశాల నుంచి హీరోగా ఎదిగారు. టైర్ 2 హీరో నుంచి స్టార్ హీరోగా మారారు. అలాగే పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో ఒడిదుడుకులు, విజయాలు, పరాజయాలను దాటుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు నాని నటించిన 'ది ప్యారడైజ్' ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైన వేళ.. ఆయన భార్య అంజనా చేసిన ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది.

Nani Wife Anjana Emotional Post Goes Viral Ahead of The Paradise Release After 16 Years

నాని సినీ కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న పరిస్థితులను గుర్తుచేస్తూ అంజనా సోషల్ మీడియా ఓ పోస్ట్‌ చేశారు. ఇందులో.. 2009లో నాని సినిమా చూడటానికి తామంతా కాలేజ్‌కు వెళ్లకుండా థియేటర్‌కు వెళ్లామని ఆమె తెలిపారు. అయితే థియేటర్‌కు వెళ్లిన తర్వాత ఆ సినిమాకు రిలీజ్ రోజున కనీసం మార్నింగ్ షో కూడా లేదని తెలిసి, చాలా నిరాశకు గురయ్యామని తెలిపారు. ఒక కొత్త హీరో సినిమాను సరైన సమయంలో థియేటర్లలోకి తీసుకురావడం ఎంత కష్టమో అప్పుడే తనకు అర్థమైందని అంజనా పేర్కొన్నారు. నాని కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఇలాంటి పరిస్థితులను దగ్గరుండి తాను చూశానని చెప్పారు.

 నా సినిమాకు అలాంటి ట్యాగ్ పెట్టొద్దు..ది ప్యారడైజ్‌పై నాని క్లారిటీ..
నా సినిమాకు అలాంటి ట్యాగ్ పెట్టొద్దు..ది ప్యారడైజ్‌పై నాని క్లారిటీ..

16 ఏళ్ల తర్వాత పూర్తిగా మారిన పరిస్థితి
2009లో కొత్త హీరోగా నాని సినిమా కోసం థియేటర్‌లో మార్నింగ్ షో కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంటే.. ఇప్పుడు అదే నాని సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అంజనా తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఒక్కో సినిమాతో నాని సంపాదించుకున్న నమ్మకమే ఇందుకు కారణమన్నారు. 'ది ప్యారడైజ్' కోసం ప్రేక్షకులు చూపిస్తున్న ఆసక్తిని చూస్తుంటే తనకు గర్వంగా, భావోద్వేగంగా ఉందని ఆమె తెలిపారు. నాని 16 ఏళ్ల ప్రయాణానికి తాను ప్రత్యక్ష సాక్షినని అంజనా అన్నారు. ఆయన ఎదుర్కొన్న కష్టాలు, సాధించిన విజయాలను దగ్గర నుంచి చూశానని తెలిపారు.

Deepika Padukone: దీప్‌వీర్ ఫ్యామిలీలోకి మరో బుజ్జి అతిథి.. రెండోసారి తల్లి అయిన దీపికా పదుకొణె
Deepika Padukone: దీప్‌వీర్ ఫ్యామిలీలోకి మరో బుజ్జి అతిథి.. రెండోసారి తల్లి అయిన దీపికా పదుకొణె

రోమ్ ఒక్కరోజులో నిర్మించబడలేదు
నాని విజయాలను ప్రస్తావిస్తూ.. 'రోమ్ నగరం ఒక్కరోజులో నిర్మించబడలేదు' అనే భావనతో నాని సంపాదించుకున్న నమ్మకం కూడా ఒక్క సినిమా లేదా ఒక్క విజయంతో ఏర్పడలేదని అన్నారు. ఎన్నో సినిమాలు, ఎన్నో అనుభవాలు, నిరంతర కష్టంతో ఈ స్థాయికి చేరుకున్నారని ఆమె పేర్కొన్నారు. నాని నటించిన ప్రతి సినిమాను ఎంతో ప్రత్యేకంగా భావిస్తారని అంజనా పేర్కొన్నారు.

Top 10 Heroes: మారిన పాపులారిటీ లెక్కలు.. ప్రభాస్‌, అల్లు అర్జున్‌, మహేష్‌, రామ్ చరణ్‌ స్థానాలివే..
Top 10 Heroes: మారిన పాపులారిటీ లెక్కలు.. ప్రభాస్‌, అల్లు అర్జున్‌, మహేష్‌, రామ్ చరణ్‌ స్థానాలివే..

ప్రతి సినిమాను తన సొంత బిడ్డలా ప్రేమిస్తారని, కొన్ని సినిమాలు నడిచాయని, మరికొన్ని వేగంగా పరిగెత్తాయని, ఇంకొన్ని ప్రయాణంలో తడబడ్డాయని ఆమె చెప్పారు. అయితే సినిమా ఫలితం ఎలా ఉన్నా.. ప్రతి సినిమాను నాని తన బిడ్డలాగే భావిస్తారని ఆమె వివరించారు. ఇక ఇప్పుడు నాని కెరీర్‌లో మరో ముఖ్యమైన సినిమా 'ది ప్యారడైజ్'. ఈ సినిమా ఏ విధంగా స్పందన అందుకున్నా చివరికి అంతా మంచే జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. అంతేకాకుండా నానికి ఎప్పటికీ తాము అండగా ఉంటామని అన్నారు. 'ది ప్యారడైజ్' విడుదల వేళ ఈ ఎమోషనల్ నోట్ వైరల్ గా మారింది. నాని సినీ ప్రస్తానాన్ని ప్రేక్షకులకు మరోసారి గుర్తు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+