"అంత కక్ష ఎందుకు ? సీరియస్ గా తీసుకుంటాం"- జగన్ వార్నింగ్..!
ఏపీలో ఇన్ సర్వీస్ టీచర్లకు కూడా టెట్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కేంద్ర మంత్రిని కలిసి ఫిర్యాదు చేశారన్న కారణంతో పలువురు ఉపాధ్యాయుల్ని సస్పెండ్ చేశారు. దీనిపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ (Ys jagan) తీవ్రంగా స్పందించారు. చంద్రబాబూ (Chandrababu)... ప్రభుత్వ ఉద్యోగులపై, అందులోనూ టీచర్లపై మరీ ఇంత కక్షగడతారా? అంటూ ఇవాళ ట్వీట్ చేశారు. మొదటి రోజు వైయస్సార్ కడప, రెండో రోజు అనంతపురం, సత్యసాయి జిల్లాలకు చెందిన ఐదుగురు ఉపాధ్యాయ సంఘాల టీచర్లను ఎందుకు సస్పెండ్ చేశారు? వారు ఏం నేరం చేశారని జగన్ ప్రశ్నించారు.
వారు ఉద్యోగంలో చేరే నాటికి లేని టెట్ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత రాయాలి, అన్న టెట్ నిబంధన వల్ల లక్ష మందికిపైగా సీనియర్ టీచర్లు ఇబ్బందులు పడుతున్నారని జగన్ తెలిపారు. ఆ నిబంధన నుంచి తమను మినహాయించాలని కోరుతూ, వారికి మద్దతు ఇస్తున్న ఎంపీలతో కలిసి కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వడమే నేరమా అని నిలదీశారు. మీ రెడ్‌బుక్ అరాచక జంగిల్‌రాజ్ చివరకు ప్రభుత్వ టీచర్లనూ వదిలిపెట్టడం లేదన్నారు. అసలు ఈ టెట్ నిబంధనను తొలగించాలని కేంద్రాన్ని కోరాల్సింది మీరు కాదా? ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి ఎందుకు తీసుకురాలేదని అడిగారు.

.@ncbn గారూ… ప్రభుత్వ ఉద్యోగులపై, అందులోనూ టీచర్లపై మరీ ఇంత కక్షగడతారా?
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 17, 2026
మొదటి రోజు వైయస్సార్ కడప, రెండో రోజు అనంతపురం, సత్యసాయి జిల్లాలకు చెందిన ఐదుగురు ఉపాధ్యాయ సంఘాల టీచర్లను ఎందుకు సస్పెండ్ చేశారు? వారు ఏం నేరం చేశారు? వారు ఉద్యోగంలో చేరే నాటికి లేని టెట్ ఇప్పుడు ఇన్ని…
మీరు చేయాల్సిన పని చేయలేదు, సీనియర్ టీచర్ల సమస్యను గాలికి వదిలేశారు, తమ సమస్యను మా పార్టీ ఎంపీల సహకారంతో తామే కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తే మాత్రం వారిపై రాజకీయ ముద్ర వేస్తారా? సస్పెన్షన్లు విధిస్తారా? అని జగన్ ప్రశ్నించారు. మీరు చేయలేని పని వారు చేయడానికి ప్రయత్నించడమే తప్పా? అన్నారు. వినతిపత్రం ఇవ్వడమే నేరమా? దానికి సస్పెన్షన్ విధిస్తారా? అని జగన్ ప్రశ్నించారు. ఒక సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, అదే సమస్యను రాజకీయ కోణంలో చూసి టీచర్లకు రాజకీయాలను అంటగట్టడం దారుణం. మరీ ఇంతగా దిగజారి వ్యవహరిస్తారా? అని నిలదీశారు. వెంటనే ఆ ఐదుగురు టీచర్లపై విధించిన సస్పెన్షన్లను ఎత్తివేయాలని, వారికి క్షమాపణ చెప్పి చేసిన తప్పును సరిదిద్దుకోవాలన్నారు. లేకపోతే ఈ అంశాన్ని అత్యంత సీరియస్‌గా తీసుకుంటామన్నారు. ఈ అన్యాయమైన సస్పెన్షన్లను సవాల్ చేసే కార్యక్రమంలో ఆ టీచర్లకు న్యాయపరంగా పూర్తిగా అండగా నిలుస్తామన్నారు. వారికి భరోసా ఇస్తామని, అన్యాయాన్ని ప్రశ్నించే ప్రతి గొంతుకూ వైయస్సార్‌సీపీ అండగా నిలుస్తుందని జగన్ తెలిపారు.














Click it and Unblock the Notifications