జైశంకర్‌ను ప్రశ్నించిన పాక్ జర్నలిస్ట్.. ఒక్క కామెంట్‌తో దిమ్మతిరిగే కౌంటర్!

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 81వ సదస్సులో పాల్గొనేందుకు న్యూయార్క్ వచ్చిన భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్.. ఓ పాకిస్తానీ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మీడియా సమావేశంలో జైశంకర్ మాట్లాడుతుండగా.. సదరు పాకిస్తానీ జర్నలిస్ట్ అకస్మాత్తుగా కలగజేసుకుని అసభ్యకరమైన స్వరంతో ప్రసంగానికి అంతరాయం కలిగించే ప్రయత్నం చేశాడు.

భారత్‌లో సిరీస్ ఆడుతుండగానే బిగ్ షాక్.. ఆ ఆటగాళ్లకు భారీ కోత!
భారత్‌లో సిరీస్ ఆడుతుండగానే బిగ్ షాక్.. ఆ ఆటగాళ్లకు భారీ కోత!

"మీ ప్రభుత్వం పాకిస్తాన్‌లో ఉగ్రవాదానికి, పరోక్ష ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఎప్పుడు ఆపుతుందో చెప్పగలరా?" అని ఆ జర్నలిస్ట్ ప్రశ్నించాడు. ఈ ఉద్దేశపూర్వక ప్రకటనను అత్యంత ప్రశాంతంగా విన్న విదేశాంగ మంత్రి, తనకే ప్రత్యేకమైన స్పందిస్తూ.. "ఓ ఉగ్రవాద దేశం నన్ను ఈ ప్రశ్న అడుగుతోంది" అని గట్టిగా సమాధానమిచ్చారు. ఆ తదనంతరం చిరునవ్వు చిందిస్తూ ఆయన అక్కడ నుంచి వెళ్లిపోగా.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

S Jaishankar counter to Pakistani journalist at United Nations Says A terrorist nation is asking me

సముద్రయాన సిబ్బంది భద్రతపై ఆందోళన
అంతకు ముందు జైశంకర్ సముద్రయాన సిబ్బంది భద్రత, రక్షణ అంశంపై నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు. అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య నౌకలు, సముద్ర కార్మికులపై జరుగుతున్న దాడులను ఏ పరిస్థితుల్లోనూ సమర్థించలేమని, ప్రాణ ఆస్తి నష్టానికి కారణమయ్యే ఈ హింస తక్షణమే ఆగాలని భారత్ తరఫున స్పష్టం చేశారు.

వాతావరణంలో ఊహించని మార్పు.. సగం దేశాన్ని కమ్మిన మేఘాలు
వాతావరణంలో ఊహించని మార్పు.. సగం దేశాన్ని కమ్మిన మేఘాలు

'గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్' చొరవకు భాగస్వామ్యం
ప్రపంచ వాణిజ్య నౌకాదళంలో పనిచేస్తున్న దాదాపు 20 లక్షల మంది సముద్ర కార్మికులు కష్టతరమైన వాతావరణంలో పనిచేస్తున్నారని జైశంకర్ పేర్కొన్నారు. సముద్ర కార్మికులకు ప్రధాన వనరుగా ఉన్న భారత్.. అతిపెద్ద షిప్పింగ్ రిజిస్ట్రీ కలిగిన లైబీరియాతో కలిసి ఈ దిశగా ముందడుగు వేసిందని వెల్లడించారు. ఏర్పాటు చేసిన 'గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్' మొదటి సమావేశానికి 25 దేశాలకు పైగా ప్రతినిధులు హాజరయ్యారని.. గతంలో బ్రిక్స్ సమావేశంలో కూడా ప్రధాని నరేంద్ర మోదీ నావికుల భద్రత అంశాన్ని ప్రస్తావించారని గుర్తు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+