కేంద్రానికి జగన్ బిగ్ షాక్ - ఆ చట్టం వెనక్కి- ఈసీ వివాదంపై సంచలన డిమాండ్స్ ...!

కేంద్ర ఎన్నికల సంఘంలో తలెత్తిన విభేదాలు, ఎన్నికల కమిషనర్ల నియామకాల కమిటీలో మార్పుల కోసం కేంద్రం మూడేళ్ల క్రితం తెచ్చిన చట్టంపై సుప్రీంకోర్టు విచారణ వివాదాల నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) సంచలన ట్వీట్ చేశారు. గతంలో పార్లమెంట్ లో ఈ చట్టానికి మద్దతిచ్చిన తాము, ఇప్పుడు మారిన పరిస్ధితుల్లో సమీక్ష కోరుతున్నట్లు జగన్ తెలిపారు. ఈ కమిటీలో కేంద్రం మార్చిన విధంగా ప్రధాని-విపక్ష నేత-ప్రధాని నామినేట్ చేసిన మంత్రి కాకుండా గతంలో ఉన్నట్లుగానే ప్రధాని-విపక్ష నేత- సీజేఐ ఉండాలంటూ జగన్ తేల్చిచెప్పేశారు.

ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగబద్ధమైన సంస్థలపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతుందని, ఎన్నికల కమిషనర్లు కొందరు నిర్ణయాలు, ఓటర్ల జాబితాలు మరియు 'ECINet' నిర్వహణపై పలు సందర్భాల్లో అభ్యంతరాలు వ్యక్తం చేశారన్న జాతీయ మీడియా కథనాలు ప్రజల్లో తీవ్రమైన ప్రశ్నలు మరియు సందేహాలకు దారితీశాయని జగన్ తెలిపారు. ఆరోపణలు-ప్రత్యారోపణలకు బదులుగా, ఓటర్ల జాబితాలో పేర్లను చేర్చడం, తొలగించడం లేదా పునరుద్ధరించడం వంటి అంశాలపై ఏయే అభ్యంతరాలు నమోదయ్యాయి, వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు, వ్యవస్థ ఎంత పారదర్శకంగా పనిచేసింది అనే విషయాలపై ప్రజలకు స్పష్టత అవసరమని తెలిపారు. ఈ అంశాలపై ప్రజలకు భరోసా కల్పించే చర్యలు చేపట్టాలన్నారు. అంతిమంగా, ఎన్నికల ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని మనం బలోపేతం చేయాలని, ప్రతి పౌరుడి ఓటు హక్కును రక్షించాలి మరియు ప్రజలు నిర్భయంగా ఆ హక్కును వినియోగించుకునేలా చేసే వ్యవస్థలను పటిష్టం చేయాలని కోరారు.

YS Jagan Seeks EC Reforms Calls for CJI-LoP-PM Panel to Appoint Election Commissioners

ప్రజాస్వామ్యంలో పారదర్శకత ఉండటమే కాదు, అది ఉన్నట్లుగా ప్రజలకు కనిపించాలి కూడా అని జగన్ తెలిపారు. అప్పట్లో తాము మద్దతు ఇచ్చిన బిల్లును (ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకం, సర్వీస్ కండిషన్లు , పదవీకాలం చట్టం, 2023) ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మళ్లీ సమీక్షించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం (అధికార పార్టీ) చొరవ తీసుకుని, ఈ భయాలను తొలగించి సరైన విధానాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ప్రతిపక్ష నేత (LoP), భారత ప్రధాన న్యాయమూర్తి (CJI), ప్రధాన మంత్రి సభ్యులుగా ఉండే ముగ్గురు సభ్యుల కమిటీ ద్వారా ఎన్నికల కమిషనర్‌ను నియమించేలా ఈ బిల్లుకు సవరణ తీసుకురావాలన్నారు. పరీక్ష రాసే విద్యార్థే పరీక్షాధికారిని నియమిస్తే, ఆ అధికారి ఎంత నిజాయితీపరుడైనప్పటికీ ఆరోపణలు వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి ఆ ప్రక్రియను తటస్థమైన వారి ద్వారా నిర్వహించడం ఎప్పుడూ మంచిదన్నారు. ఈ చర్య ఎన్నికల సంఘంపై గౌరవాన్ని, విశ్వాసాన్ని ఖచ్చితంగా పునరుద్ధరిస్తుందన్నారు.

YS Jagan Seeks EC Reforms Calls for CJI-LoP-PM Panel to Appoint Election Commissioners

ఇది చాలా ముఖ్యమైన విషయమని, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో 'SIR' ప్రక్రియ సమయంలో అధికార పార్టీ తన అధికారాన్ని దుర్వినియోగం చేసిందని జగన్ గుర్తుచేశారు. అనేక సందర్భాల్లో తమ విజ్ఞప్తులను పట్టించుకోలేదని, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో కూడా, డివిజన్ల పునర్విభజన తీరుపై ప్రతిపక్ష పార్టీగా తాము వ్యక్తం చేసిన అభ్యంతరాలను తోసిపుచ్చారని తెలిపారు. ఇటువంటి చర్యలు ఎన్నికల ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని నిస్సందేహంగా బలహీనపరుస్తాయన్నారు. ప్రజాస్వామ్యంలో ఒక సంస్థ పనితీరుకు పారదర్శకత, జవాబుదారీతనం నిజమైన కొలమానాలు, వాటిని కాపాడటం ఆ సంస్థ యొక్క ప్రాథమిక బాధ్యత అని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+