కరోనా బారిన పడ్డారా... అయితే ఈ షాకింగ్ న్యూస్ తెలుసుకోవాల్సిందే..!
కరోనా సోకిన వారిలో గుండెపోటు వచ్చే అవకాశాలు ఐదురెట్లు ఎక్కువగా ఉన్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పేర్కొంది.
హైదరాబాద్: మీరు గతంలో కోవిడ్ -19 బారిన పడ్డారా..? కరోనా సోకి మీరు మరణపుటంచుల వరకు వెళ్లి వచ్చారా..? ఇప్పుడు మీ పరిస్థితి మెరుగుపడిందా.. అయినప్పటికీ సేఫ్ కాదంటోంది తెలంగాణ ఇండియన్ మెడికల్ అసోసియేషన్. అవును మీరు చదివింది నిజమే. ఈ మధ్యకాలంలో గుండెపోటుతో యువత ఎక్కువగా మృతి చెందుతోంది. అప్పటివరకు బాగానే ఉండి చాలా యాక్టివ్‌గా ఉన్న యువతీయువకులు ఒక్కసారిగా కుప్పకూలి పోతున్నారు. ఇందుకు కారణం గుండెపోటు. ప్రస్తుతం ఇదే దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఈ సమయంలోనే తెలంగాణ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బాంబు పేల్చింది. కోవిడ్ బారిన పడిన యువతకు గుండెపోటుతో మరణించే అవకాశం ఐదురెట్లు అధికంగా ఉందట.

కోవిడ్ ద్వారానే మరణాలు సంభవిస్తున్నాయా..?
తెలంగాణలో పెరుగుతున్న సడెన్ డెత్స్‌పై జరిగిన విశ్లేషణలో ఈ విషయం వెల్లడైంది. అయితే అనుకోకుండా సంభవిస్తున్న ఈ మరణాలపై మరింత లోతైన విశ్లేషణ జరపాలని తెలంగాణ ఇండియన్ మెడికల్ అసోసిషియేషన్ నిర్ణయించింది. ఐఎంఏ అంచనా ప్రకారం కోవిడ్ -19 ద్వారా గుండెపోటు వచ్చి మరణించడానికి గల కారణాలు చాలా ఉన్నాయని వివరిస్తోంది. మారిన జీవనశైలి (Life style), పెరుగుతున్న ఒత్తిడి, ఆరోగ్యంపై అలసత్వంలాంటి పలు అంశాలు గుండెపోటుకు దారితీసి ఆ తర్వాత మనిషి చావుకు కారణమైతున్నట్లు ఐఎంఏ పేర్కొంది. ఇదిలా ఉంటే కోవిడ్ వ్యాక్సిన్‌ల ద్వారా ఈ గుండెపోటు వస్తోందన్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఈ మరణాలపై మరింత లోతైన పరిశోధనలు చేయడం ద్వారా ప్రజల్లో ఉన్న భయాందోళనలను తొలగించొచ్చని భావిస్తోంది.

గుండెపోటుతో రెండు రకాల ఆకస్మిక మరణాలు
పెద్ద వయసున్న వారిలో మరణాల సంఖ్య ఎక్కువగా గుండెపోటు ద్వారా వచ్చినవే అని స్పష్టం చేసింది. వారికున్న శ్వాసకోశ సంబంధిత సమస్యలతోనే గుండెపోటు రావడం మృతి చెందడం జరుగుతోందని ఐఎంఏ వెల్లడించింది. అయితే గుండెపోటు ద్వారా కాకుండా ఇతరత్ర కారణాలతో ఆకస్మిక మరణాలు జరగడం చాలా అరుదుగా జరుగుతుందని ఐఎంఏ వివరించింది.
యువతకు ఐఎంఏ సూచనలు
* 30 ఏళ్లు పైబడిన వారు బీపీ, బ్లడ్ షుగర్, పరకడుపున లిపిడ్ టెస్టులు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి
* 40 ఏళ్లు పైబడిన వారు ఏడాదికోసారి కార్డియక్ చెకప్, ఎలక్ట్రోకార్డియోగ్రామ్, ఎకో కార్డియోగ్రామ్, ట్రెడ్‌మిల్ టెస్టులు చేయించుకోవాలి.
ఒకవేళ గుండెసంబంధిత వ్యాధులు ఉన్నట్లయితే వీరు సత్వరమే చెక్ చేయించుకుంటే మంచిదని ఐఎంఏ సూచిస్తోంది. అంతేకాదు పొగతాగడం, హైపర్ టెన్షన్, డయాబెటిస్, మీ కుటుంబ సభ్యులకు గుండెసంబంధిత వ్యాధులు ఉన్నా వెంటనే చెక్ చేయించుకోవాలి.

గుండెపోటు నుంచి తప్పించుకోవాలంటే...
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం, శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవడం, పొగతాగడం మానుకోవడం,మద్యం సేవించకపోవడం, ఒత్తిడికి దూరంగా ఉండటం, రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రలాంటివి గుండెపోటుకు దూరం చేస్తాయి. అంతేకాదు ప్రతి ఒక్కరూ సీపీఆర్ నేర్చుకోవడమే కాదు ఇతరులకు అవగాహన కల్పించాలని ఐఎంఏ సూచిస్తోంది. అంతేకాదు పెరుగుతున్న మరణాల విషయంపై ఎక్కువగా భయాందోళనలు చెందకూడదని సూచిస్తున్నారు. మరణాలు ఒక్క కారణం చేతనే జరగడం లేదని, పలు రకాల కారణాలతో ఈ మరణాలు సంభవిస్తున్నాయనే విషయాన్ని గుర్తెరగాలి.
మొత్తానికి కరోనా సోకి ప్రాణాలతో బయటపడ్డవారు మరింత జాగ్రత్తగా ఉంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అదే సమయంలో ఐఎంఏ సూచించిన గైడ్‌లైన్స్‌ను ఫాలో కావాలని కోరుతున్నారు.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications