స్త్రీ, పురుషుల కలయిక వల్ల పిల్లలు ఎలా పుడతారంటే..!
ప్రతి జీవికి జననం, మరణం సహజం. పుట్టినవారు గిట్టక తప్పదు.. గిట్టినవారు పుట్టక తప్పదు అని శాస్త్రాలు, పురాణాలు చెబుతున్నాయి. మరణించిన తర్వాత ఏ జన్మ ఎత్తుతారు అనేది భగవంతుడి నిర్ణయం. ఆ జన్మలో మనం చేసిన పనులనుబట్టి ఆధారపడివుంటుంది. మంచి చేస్తే మంచి జన్మ.. చెడు చేస్తే చెడు జన్మ కలుగుతుంది. స్త్రీ, పురుషుల కలయికవల్ల పిల్లలు పుడతారనే విషయం తెలిసిందే. భూమిపై ఉన్న 84 లక్షల జీవరాశుల్లో ఒక్క నెమలి తప్ప మిగతా అన్ని జీవులు, మనుషులతో సహా సంయోగం జరపాల్సిందే. ఈ పుట్టడం అనేది ఎలా జరుగుతుంది? ఈ ప్రక్రియ ఏమిటి? అనేది తెలుసుకుందాం.
జైగోట్ విడుదలవుతుంది
ఒక కొత్త జీవి పుట్టుకొచ్చే అద్భుతమైన ప్రక్రియ స్త్రీ, పురుషుల కలయిక. వీరిద్దరి శరీరాల్లో ప్రత్యేకమైన కణాలు ఉంటాయి. వీటిని గమేట్లు అంటారు. స్త్రీలల్లో అండాలు అనే గమేట్లు, పురుషుల్లో శుక్రకణాలు అనే గమేట్లు ఉంటాయి. ఫలదీకరణం ఎలా జరుగుతుందంటే.. ఒక స్త్రీకి నెలసరి వచ్చే సమయంలో అండం విడుదలవుతుంది. లైంగిక సంపర్కం జరిగినప్పుడు, పురుషుడి శుక్రకణాలు స్త్రీ గర్భాశయంలోకి ప్రవేశిస్తాయి. ఈ శుక్రకణాలలో ఒకటి అండంతో కలిస్తే ఫలదీకరణం జరిగినట్లు అంటారు.
ఫలదీకరణం జరిగిన అండం జైగోట్ అవుతుంది.

పిండం ఏర్పడటం
జైగోట్ కణాలు విభజితమై పెరుగుతూ పిండంగా మారుతుంది. ఈ పిండం గర్భాశయం గోడకు అతుక్కుని పోతుంది. పిండం గర్భాశయంలో పెరుగుతూ, తల్లి నుండి పోషకాలను తీసుకుంటూ పిండంగా అభివృద్ధి చెందుతుంది. తల్లి గర్భంలో 9 నెలలు పెరిగిన పిండం శిశువుగా మారి, ప్రసవం ద్వారా బయటికి వస్తుంది. సరళంగా చెప్పాలంటే, స్త్రీ శరీరం ఒక పిల్లవాడిని పెంచేందుకు సిద్ధమవుతుంది. పురుషుడి శరీరం ఆ పిల్లవాడిని సృష్టించేందుకు కావాల్సిన కణాలను అందిస్తుంది. ఈ రెండింటి కలయిక వల్లే ఒక కొత్త జీవి ఉద్భవిస్తుంది. అయితే పిల్లలు పుట్టడం అనేది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ అని జీవశాస్త్రం చెబుతోంది.












Click it and Unblock the Notifications