ఆశారాం బాపుకు వైద్య పరీక్షలు: కోర్టుకు నివేదిక

మైనర్ బాలికపై లైంగిక దాడి చేసినట్లు వచ్చిన ఆరోపణలు రుజువు కావడంతో పోలీసులు ఆశారాం బాపును అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాల మేరకు జోధ్‌పూర్ సెంట్రల్ జైలుకు తరలించిన విషయం తెలిసిందె. సోమవారం ఆశారాంకు వైద్యుల బృందం వైద్య పరీక్షలు నిర్వహించింది. అనంతరం ఎంఆర్ఐ కోసం ఆశారాం బాపును ఎండీఎం ఆస్పత్రికి తరలించారు.
సెప్టెంబర్ 6న ఆశారాం బాపు చేసిన విజ్ఞప్తి మేరకు జిల్లా సెషన్స్ కోర్టు(రూరల్) ఆదేశాలతో వైద్య బృందం అతనికి వైద్య పరీక్షలు నిర్వహించింది. అదే సమయంలో ఆశారాం తనకు ఆరోగ్యకరమైన ఆహారం, సరైన బెడ్, గంగా జలం, మరికొన్ని సదుపాయాలు జైలులో కల్పించాలని కోరాడు. ఆశారాం తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్నాడని అతని తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.
వైద్య బృందం ఆశారాంకు సంబంధించిన ఆరోగ్య నివేదికను మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టనుంది. నివేదికను పరిశీలించిన తర్వాత ఆశారాంకు వైద్యులు సూచించిన ఆహారం అవసరమా లేదా అనే దానిపై కోర్టు ఆదేశాలు జారీ చేయనుంది.
కాగా ఆశారాం బాపు తన బెయిల్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఢిల్లీ నుంచి ప్రముఖ లాయర్‌ను తన బెయిల్ కోసం హైకోర్టులో వాదించేందుకు తీసుకువస్తున్నట్లు సమాచారం. అయితే ఈసారి ఆశారాంకు బెయిల్ లభించే అవకాశం ఆశారాం బాపు వర్గీయుల ద్వారా తెలుస్తోంది. అయితే ఆశారాంకు సంబంధించిన ఇక్కడి న్యాయవాదులు మాత్రం ఈ విషయంపై స్పందించడం లేదు.












Click it and Unblock the Notifications