రేప్ చేస్తే భవిష్యత్తులో ఉరే: షిండే, ఉరిపడాలని తండ్రి

అత్యాచారాల నిరోధానికి తాము చట్టాలను కఠినతరం చేశామని, ఆ విధమైన కేసుల్లో దోషులకు ఉరిశిక్ష పడే విధంగా చట్టాలకు సవరణలు చేశామని ఆయన చెప్పారు. నిర్భయ అత్యాచారం కేసులో నలుగురికి ఉరిశిక్ష వేయాలని అడుగుతారా అని ప్రశ్నిస్తే ఇటువంటి కేసుల్లో భవిష్యత్తులు ఉరిశిక్షలే పడుతాయని ఆయన పునరుద్ఘాటించారు.
నిర్భయపై అత్యాచారం కేసులో సాకేత్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు నలుగురు నిందితులను దోషులుగా నిర్ధారిస్తూ తీర్పు వెలువరించిన తర్వాత సుశీల్ కుమార్ షిండే మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో తీర్పు వెలువరించే సమయంలో నలుగురు నిందితులు కూడా కోర్టులోనే ఉన్నారు.
ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పుపై తాము పై కోర్టుకు వెళ్తామని నిందితుల తరపు న్యాయవాది ఎపి సింగ్ చెప్పారు. రాజకీయ ప్రేరేపితంతో తీర్పు వెలువడిందని ఆయన విమర్శించారు. నిజాయితీగా విచారణ జరగలేదని, తాము హైకోర్టుకు వెళ్తామని ఆయన అన్నారు.
ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో దోషులకు మరణశిక్ష పడాలని నిర్భయ తండ్రి ఆశిస్తున్నాడు. కోర్టు తీర్పు పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తూనే దోషులకు ఉరిశిక్ష పడాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఉరిశిక్ష కన్నా తక్కువ శిక్ష సమ్మతం కాదని అన్నాడు.












Click it and Unblock the Notifications