కోటి సూర్యుల సమానం: నేడు రథ సప్తమి, ఏమేం చేయాలి?
రథ సప్తమి దీన్నే , అచలాసప్తమి , మాఘ శుక్ల సప్తమి , మకర సప్తమి అని అంటారు. ఇది కోటి సూర్యుల సమానము. అందు స్నాన , అర్ఘ్య దానములు చేయాలి.
హైదరాబాద్: రథ సప్తమి దీన్నే అచలాసప్తమి , మాఘ శుక్ల సప్తమి , మకర సప్తమి అని అంటారు. ఇది కోటి సూర్యుల సమానము. అందువలన స్నాన , అర్ఘ్య దానములు చేయాలి. అందువల్ల ఆయుస్సు , ఆరోగ్య సంపదలు లభిస్తాయి. నదిలో స్నానము చేసి, షష్టి యందే ఏకభుక్తం ( ఒంటి పూట భోజనము ) ఆచరించి, సప్తమియందు అరుణోదయ స్నానము చేయాలి.
నిశ్చల జలము యొక్క పైభాగాన దీపముంచాలి. ఈ దీపాన్ని బంగారు , లేదా వెండి లేదా ఆనపకాయ పాత్రలో చేసి భక్తితో నూనె , వత్తి వేయాలి. పసుపు రంగు , కేసరి రంగుతో అలంకరించాలి. మొదట మనసును పదిల పరచుకొని శిరస్సు యందు దీపముంచుకొని సూర్యుని హృదయము నందు ధ్యానించి ఈ మంత్రాన్ని పలకాలి
॥ నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః
వరుణాయ నమస్తేస్తు రివాస నమోస్తుతే..॥
సూర్యుణ్ణి ధ్యానించి దీపాన్ని నీట వదలాలి. నీటిలో , చందనంతో , ఎనిమిది ఆకులు గల పద్మమును వ్రాసి , కర్ణికను కూడా రాయాలి . మధ్యలో పత్నితో కూడిన శివుని ప్రణవముతో కూడా రాయాలి. తూర్పు దళముతో మొదలుపెట్టి , రవి , భాను , వస్వత్ , భాస్కర , సవితృ , అర్క , సహస్ర కిరణ , సర్వాత్మకులను ధ్యానించి పూజించి ఇంటికి వెళ్ళాలి.
ఇంటి యందు స్నానం చేస్తే ( పాదోదక స్నానం ) చెరుకు గడ తో నీటిని కదిలించి , ఏడు జిల్లేడాకులు , రేగు ఆకులు తలపైన , భుజాలపైన ఉంచుకొని , ఈ మూడు మంత్రాలు చెప్పాలి.

॥ యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు
రోగం చ శోకం చ మాకరీ హంతు సప్తమీ ॥
॥ ఏత్జన్మ కృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం
మనో వాక్కాయజం ఉచ్చ జ్నాతాజ్నాతేచ యే పునః ॥
॥ ఇతి సప్తవిధం పాపం స్నానాన్మే సప్తసప్తికే
సప్తవ్యాధి సమాయుక్తం హర మాకరి సప్తమి ॥
స్నానం చేసి , నువ్వుల పిండితో చేసిన అపూపములతో బంగారు సూర్యుణ్ణి పూజించి బ్రాహ్మణుడికి దానమివ్వాలి. కింది మం త్రముతో సూర్యుడికి అర్ఘ్యము ఇవ్వాలి
॥ సప్తసప్తి వహప్రీత సమలోక ప్రదీపన
సప్తమీ సహితో దేవ గృహాణార్ఘ్యం దివాకర ॥
ధ్యానం చేయాలి అనంతరం సూర్యవిగ్రహానికి ఉద్వాసన చేసి ఇంటికి వచ్చి సంతర్పణ చేయాలి.
ఈ వ్రత తంతు కొంత రథసప్తమిూ విధానంలోనే వున్నందున ఇది క్రమంగా ప్రచారంలో తగ్గిపోయి వుంటుంది. వ్రతోత్సవచంద్రికాకారుడు ఈ వ్రత విధానం ఇప్పడు హిందూ దేశంలో ఏ మూలా కనిపించడం లేదని వ్రాస్తున్నాడు. మదనరత్నము, ఆదిత్యపురాణాల్లో రథసప్తమి పుత్రసప్తమి వ్రతాన్ని చేస్తారని చెబుతున్నాయి.
ఈ వ్రతాన్ని సూర్యుడే భక్తులకు స్వయంగా ఉపదేశించినట్ల ఆదిత్యపురాణంలో వుంది. ప్రతిసప్తమికి పన్నెండు మాసాలూ నన్ను పూజ చేస్తూ మాఘశుక్ల సప్తమినాటికి ఆ పూజ సమాప్తం చేయాలి. ఆనాడు స్నానానంతరం తెల్లపూలదండ మెడలో వేసుకుని క్షీరం నైవేద్యం పెట్టాలి. పాయసం వండి బ్రాహ్మలకి సంతర్పణ చేయాలి. అట్టివారి ఇండ్లల్లో నేను స్వయంగా పుడతాను.
ఇది సౌరసప్తమిలోనే అంతర్గతమై ఉన్నందున ప్రత్యేక ప్రచారమందినట్లు కనిపించదు.
రథసప్తమికి సప్త సంఖ్యకు సబంధం రథసప్తమికి సప్తసంఖ్యకు ఏదో కొంత సంబంధం ఉండి ఉండాలి. సూర్యుని రథాన్ని లాగే గుర్రాలు ఏడు. సూర్య కిరణాల్లో గల ఏడురంగులకు అవి చిహ్నాలు.
ఈ పర్వం జరిగే దినం ఏడవ తిథి. ధాన్యాలు సాధారణంగా నవసంఖ్య కలవిగా ఉండగా రథసప్తమి నాటికి కార్యకలాపంలో మాళవస్త్రీలు ఏడు ధాన్యాలే వాడుతారు. మనదేశంలో ఆనాడు చేయబడే చిక్కుడు కాయల రథాలున్నూ ఏడే తప్పితే పదునాలుగు కాని, ఇరవై ఒక్కటి కాని చేస్తారు. ఎవరిని పూజించడానికి యిూ రథసప్తమి ఉద్దేశింపబడిందో అట్టి సూర్యుడిని స్తుతించే సంస్కృత మంత్రాల్లో సప్తలోక ప్రదీపన' అనే బిరుదు ఉండడం గమనింపతగ్గది.
ద్రవిడ, ఆంధ్ర, మహారాష్ట్ర, వంగదేశాల్లో ఈ పండుగ ప్రచారంలో ఉంది. పంజాబ్, రాజపుటానా, గుజరాత్, ఉత్తరప్రదేశ్లో అంతగా లేదు. కొన్ని మినహాయింపులు ఈనాడు వేదాధ్యయనం మానివేస్తారు ఈనాడు పుస్తక పఠనం చేస్తే పాపమంటారు. -ద్రనాడు తరిగిన కూర తినరాదంటారు.
రథసప్తమి కోణార్క క్షేత్రంలో జరిపితే విశేష ఫలప్రదంగా ఉంటుంది. తిథితత్వములో ఈనాడు విష్మరూపేణ భాస్కరపూజ, సూర్యార్థ్యదానం జరపాలని కలదు. చతుర్వర్ల చింతామణిలో నేడు అనేక వ్రతాలు చేస్తారని కలదు. అచలాసప్తమి, మందారసప్తమి, రథాంగసప్తమి, మహాసప్తమి, జయంతిసప్తమి, సిద్దార్థకాదిసప్తమి, విజయసప్తమి, ద్వాదశసప్తమి, పుత్రసప్తమి, విశోకసప్తమి, విజయాయజ్ఞసప్తమి, పరశ్చరణ సప్తమి మున్నగు వ్రతాలు ఈనాడు చేస్తారని ఉంది.
ఆమాదేర్ జ్యోతిషీ అనే గ్రంథంలో విధానసప్తమి, ఆరోగ్యసప్తమి, మాకరీసప్తమి మున్నగువ్రతాలు చెప్పబడ్డాయి. గదాధర పద్దతి ఈనాటికి సీతాసప్తమిగా పేర్కొంటూ ఒరిస్సాలోని లింగరాజ ప్రతిమాదర్శనం చేయాలని చెబుతూ ఉంది. అభోజార్కవ్రతం అంటోది.












Click it and Unblock the Notifications