ఈరోజే ఆషాఢ అమావాస్య.. ఇలా చేస్తే అఖండ లక్ష్మీ కటాక్షం

కొన్ని సంవత్సరాల తర్వాత అరుదైన అమావాస్య ఆషాఢ మాసంలో వచ్చింది. ఆది అమావాస్య అంటారు. ఆరోజు లక్ష్మీదేవిని పూజిస్తే కుబేరులవుతారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. లక్ష్మీదేవికి ఆరోజు ప్రత్యేకంగా దీపపు కుందుల పూజ చేస్తే ఏడాది పొడవునా లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉంటుంది. దీన్ని దీపస్తంభ పూజ అంటారు. వత్తులు వెలిగించే దీపపు కుందులకు పూజ చేస్తారు. ఆవు నెయ్యితో వెండి ప్రమిదల్లో మూడు వత్తులు వేసి వెలిగించడం వల్ల అనేకరకాలుగా కలిసివస్తుంది.

ఒక్క ప్రమిదతో ఇల్లు మొత్తం దీపం చూయించాలి
ఇంట్లో ఒకవేళ వెండి ప్రమిదలు అందుబాటులో లేకపోయినా ఇత్తడి కుందుల్లో కూడా పూజించవచ్చు. దీపం వెలిగించిన తర్వాత ఓం దీప లక్ష్మి నమో నమః అనే మంత్రాన్ని పఠించాలి. అంతేకాదు.. ఆ దీపాలకు కర్పూరాన్ని వెలిగించి హారతి ఇవ్వాలి. అమావాస్య రోజు ఇంట్లోని ఎనిమిది మూలల్లో దీపాలు వెలిగిస్తే అష్టలక్ష్ములంతా ఆశీర్వదిస్తారు.

August 4th Ashada Amavasya will bring good luck to do this

తర్వాత అష్టలక్ష్మీ మంత్రాన్ని పఠించాలి. అలా కుదరకపోతే ఒక్క ప్రమిదను వెలిగించి అన్ని గదుల్లో దీపాన్ని చూపించొచ్చు. వ్యాపారస్తులకు భారీగా లాభాలు రావాలంటే ఆషాఢ అమావాస్య రోజు గ్రామదేవతలకు కుంకుమ సమర్పించి పూజ చేయాలి. అలాగే అందరూ తమ గ్రామ దేవతలను దర్శించుకోవడంవల్ల మంచి జరుగుతుంది. ఇలా చేయడంవల్ల అనారోగ్య సమస్యలు మనల్ని ఇబ్బంది పెట్టవు. అంతేకాకుండా నిమ్మకాయ దీపాలు వెలిగించడం, నిమ్మకాయల దండను అమ్మవారికి సమర్పించడంవల్ల శత్రు బాధలు, రుణబాధలు తొలగిపోతాయి.

మొక్కలకు నీరు పోయాలి
ఆషాఢ అమావాస్య రోజు ఎవరినీ ఇబ్బంది పెట్టకూడదు. మొక్కలకు నీరు పోయాలి. దీనివల్ల గ్రహ దోషాలు, పితృ దోషాలు తొలగిపోతాయి. మూగజీవాలను హింసించకూడదు. కాకులకు ఆహారం పెట్టాలి. పెద్దలను అవమానించకూడదు. పేదలకు దుస్తులతోపాటు మనకు నచ్చినవి దానం చేయొచ్చు. పూర్వీకుల ఆత్మ శాంతించేందుకు, వారు సంతోషంగా ఉండేందుకు తర్పణం వదలడం, శ్రాద్ధకర్మ చేయడంతోపాటు మహా విష్ణువును, లక్ష్మీదేవిని పూజించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+