వారఫలాలు.. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలే మంచి భవిష్యత్తుకు పునాది!!

జ్యోతిష్య శాస్త్రంలో 12 రాశులు, 27 నక్షత్రాల గురించి పూర్తిగా చెబుతారు. నిర్దిష్ట సమయం తర్వాత గ్రహాలు తమ రాశులను మారుస్తుంటాయి. ఈనెల 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు వివిధ రాశులవారి రాశిఫలాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.

తులారాశి
సకాలంలో పనులు ప్రారంభించాలి. ముఖ్యమైన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగ విధుల్లో శ్రద్ధ చూపిస్తున్నప్పటికీ కొందరివల్ల విఘ్నాలు ఎదురయ్యే అవకాశం ఉంది. పనులన్నీ ఒక ప్రణాళిక ప్రకారం పూర్తికావాలి. ఆలోచనల్లో పూర్తిస్థాయి స్పష్టత ఉండాలి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలే మంచి భవిష్యత్తుకు పునాది వేస్తాయి. ఆర్థిక ప్రయోజనాలున్నాయి. విష్ణు నామస్మరణ వల్ల పనులు జరుగుతాయి.

horoscope

వృశ్చికరాశి
చేస్తున్న పనులమీద శ్రద్ధ ఉండాలి. ఈ సమయం వ్యతిరేకంగా ఉంది. వేసే ప్రతి అడుగు బాధ్యతగా వేయాలి. ఏ పని అవకపోయినా నిరుత్సాహం వద్దు. ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటూ ముందుకు పయనించండి. ఆర్థిక ఇబ్బందులు రాకుండా ప్రణాళికలు నిర్వచించండి. కుటుంబ సభ్యుల నుంచి వచ్చే సూచనలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి. ధర్మదేవత అనుగ్రహం ఉంది. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి.

ధనుస్సు రాశి
పనులు సకాలంలో పూర్తిచేయడంవల్ల మంచి విజయాలు లభిస్తాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళతారు. గృహ నిర్మాణానికి సంబంధించిన పనులు మంచి ఫలితాలనిస్తాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. పిల్లల వల్ల ఆనందం కలుగుతుంది. వ్యాపారస్తులు శ్రద్ధ పెంచాలి. ఇంట్లో మంచి జరుగుతుంది. ఇష్టదేవతను స్మరించడంవల్ల సంకల్పం నెరవేరుతుంది.

మకర రాశి
వీరి సంకల్పం సిద్ధిస్తుంది. తద్వారా విజయావకాశాలు పెరుగుతాయి. ఉద్యోగంలో ఎదురయ్యే ఫలితాలు ఆనందాన్నిస్తాయి. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న పనులు పూర్తవుతాయి. కొన్ని సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. ఎటువంటి విఘ్నాలు ఎదురైనప్పటికీ బుద్ధిబలంతో అధిగమించాలి. ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా కలిసివస్తుందికానీ ఆవేశం ఉండకూడదు. సుబ్రహ్మణ్యస్వామిని స్మరించడంవల్ల ప్రశాంత జీవనం కలుగుతుంది.

కుంభరాశి
ముందుగా ప్రణాళికలు రచించి వాటిని అమలు చేయడంవల్ల వ్యాపారంలో లాభం వస్తుంది. ఆర్థికంగా కలిసివస్తుంది. ఏ పనిచేసినా పట్టుదలతో చేయాలి. ఏ పనినీ మధ్యలో ఆపొద్దు. దేనికోసం మీరు కృషిచేస్తున్నారో అందులో విజయం సాధిస్తారు. కాలం వృథా అవకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. చంచలత్వం పనికిరాదు. ప్రతి పనికీ పట్టువిడుపులు అవసరం. నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి.

మీనరాశి
ధర్మం గెలిపిస్తుంది. ఆశయం నెరవేరి మంచి ఫలితాలను సాధిస్తారు. చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ తీసుకున్న నిర్ణయాన్ని సాహసోపేతంగా అమలు చేయాలి. సాధ్యమైనంతవరకు మౌనంగా ఉండటం మేలు చేస్తుంది. ఒత్తిడికి గురికావొద్దు. ఆత్మీయులిచ్చే సూచనలు పాటించడంవల్ల మేలు కలుగుతుంది. వ్యాపారంపై శ్రద్ధ ఉండాలి. ఎటువంటి అపార్థాలకు తావు ఇవ్వొద్దు. విష్ణు సహస్రనామం శుభాలను కలిగిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+