28న చంద్ర గ్రహణం.. ఈ రాశులకు మహర్దశ
ఈ ఏడాదిలో మొత్తం నాలుగు గ్రహణాలున్నాయి. ఇప్పటికి రెండు పూర్తయ్యాయి. మిగిలిన సూర్యగ్రహణం, చంద్ర గ్రహణాల్లో ఒకటైన చంద్ర గ్రహణం కొద్దిరోజుల్లోనే సంభవించనుంది. 2023లో ఇండియాలో కన్పించే ఏకైక గ్రహణం ఇదే కావడం విశేషం. అందుకే దీని ప్రభావం గట్టిగా ఉంటుంది. అదే సమయంలో సూతకకాలం కూడా వర్తిస్తుంది. సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం.. రెండూ అక్టోబరు నెలలోనే రానున్నాయి. అక్టోబరు 14వ తేదీన సూర్య గ్రహణం, 28వ తేదీన చంద్ర గ్రహణం ఏర్పడనుంది. మనదేశంలో కనిపించే ఏకైక గ్రహణం ఇదే కావడంతో దీనికి ప్రాధాన్యత పెరిగింది.
పౌర్ణమి రోజున : అశ్విని మాసం పౌర్ణమి రోజున చంద్ర గ్రహణం సంభవిస్తుంది. అక్టోబర్ 28వ తేదీన అర్ధరాత్రి 1.06 గంటలకు ప్రారంభమై.. 2.22 గంటల వరకు ఉంటుంది. 1 గంట 16 నిమిషాలు గ్రహణ సమయం. దీన్ని అంశిక చంద్ర గ్రహణంగా పిలుస్తారు. చంద్ర గ్రహణం సూతక కాలం 8 గంటల ముందే ప్రారంభమై మనదేశంలో కనిపించదు. యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ మహా సముద్రం, అంటార్కిటికా, ఆర్కిటిక్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, హిందూ మహా సముద్రం, ఆఫ్రికాలో కనిపిస్తుంది.

ధనుస్సు రాశి : చంద్ర గ్రహణం వల్ల ధనుస్సు రాశివారికి ఊహించని ధనలాభం కలుగుతుంది. ఆర్థికంగా బలోపేతమవుతారు. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం. వారికి ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ లభిస్తుంది. వ్యాపారస్తులకు లాభాలున్నాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మిథునరాశి : ఇక చంద్ర గ్రహణం ప్రభావంతో మిధున రాశి జాతకులకు సైతం ఊహించని ధనలాభం ఉంటుంది. చేపట్టిన ప్రతి పని విజయవంతమౌతుంది. కెరీర్‌లో కొత్త అవకాశాలు లభిస్తాయి. పెండింగులో లేదా ఎక్కడైనా నిలిచిన డబ్బులు చేతికి అందుతాయి. ఈ ఏడాది రెండవ, చివరి చంద్ర గ్రహణం ప్రభావంతో ఈ రెండు రాశులకు మాత్రం అమితమైన లబ్ది చేకూరనుంది












Click it and Unblock the Notifications