కీలక ఖగోళ గమనం... ఈ రాశులపై ప్రభావం
బుధుడు తిరోగమనంలో ఉన్నాడు. ఈనెల 13న ప్రారంభమైన ఈ గమనం జనవరి 1తో ముగుస్తుంది. బుధ గ్రహ తిరోగమనం మకరం, ధనుస్సు రాశుల మధ్య ఉంటుంది. అయితే ఈ ప్రభావం కొన్ని రాశులపై సానుకూలంగా ఉంటే మరికొన్ని రాశులపై ప్రతికూలంగా ఉండనుంది. గ్రహాల తిరోగమనం మూడు దశల్లో ఉంటుంది. ప్రీ-షాడో మొదటి దశ. దీని ప్రభావం మూడు వారాల ముందు నుంచే ఉంటుంది. రెండో దశను షాడో అంటారు. తిరోగమన ప్రభావం ఈ దశలో ఎక్కువగా ఉంటుంది.
ఈ దశలో పరిస్థితులు ప్రతికూలంగా మారుతాయి. ఈ దశ రెండు నుంచి మూడు వారాలు ఉంటుంది. ఆ తరువాత దశలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయి. ఇది మూడు వారాలు ఉంటుంది. ఈ తిరోగమనం కొన్ని రాశులపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది.
మేషం, కర్కాటకం, తుల, మకరం
ఈ నాలుగు రాశులపై బుధుడి తిరోగమన ప్రభావం తక్కువగా ఉంటుంది. మేషం అగ్నికి సంకేతం. కర్కాటకం నీటికి, తుల వాయువుకు, మకరం భూమికి సంకేతం. బుధుడి తిరోగమనం ప్రధానంగా ఆర్థిక వ్యవహారాలపై ఒత్తిడికి గురిచేస్తుంది. ఈ రాశులవారు ఉద్యోగం, కెరీర్ మార్గాన్ని మార్చడం గురించి ఆలోచించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

వృశ్చికం, సింహం, కుంభం, వృషభం
ఓర్పు, బలం, సంకల్పం ఈ రాశులకు ఎక్కువగా ఉంటాయి. ప్రతికూల పరిస్థితులను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు. చేసే పనుల ద్వారా సంతృప్తి చెందే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. తమ జీవితంలో ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారో గుర్తించి, అందుకు తగినట్లుగా ప్రయత్నాలు ప్రారంభించాలి.
కన్య, మిథునం, ధనుస్సు, మీనం
ఈ నాలుగు రాశుల ప్రవర్తన అస్థిరంగా ఉంటుంది. తిరోగమన సమయంలో సంఘర్షణను నివారించడానికి ఎదుటివారితో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ విషయంలో మార్పు రాకపోతే ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications