12 రోజుల్లో వీరి జాతకం తిరగబడుతుంది... ఇందులో మీ రాశి ఉందా?
గ్రహణాలను ఖగోళ సంఘటనలుగా భావిస్తారు. సూర్యగ్రహణం అమావాస్య రోజున, చంద్రగ్రహణం పౌర్ణమి రోజున ఏర్పడటం జరుగుతుంది. హిందూ పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ 20న ఏర్పడబోతోంది. ఇది మనదేశంలో కనిపించదు. ఏప్రిల్ 20వ తేదీ ఉదయం 7.04 గంటలకు మెుదలయ్యే గ్రహణం మధ్యాహ్నం 12:29 గంటలకు వరకు ఉండబోతోంది. ఇది జరిగిన రెండు వారాల తర్వాత వైశాఖ పూర్ణిమ రోజు చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఏప్రిల్ 14వ తేదీన సూర్యుడు మీనరాశిని వదిలిపెట్టి మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. మెుదటి సూర్యగ్రహణం కూడా మేషరాశిలోనే ఏర్పడబోతుంది. ఈ గ్రహణం సందర్భంగా జాగ్రత్తగా ఉండాల్సిన రాశులవారి గురించి తెలుసుకుందాం.
కన్య రాశి : సూర్యగ్రహణం వద్ద పనిచేసే కార్యాలయాల్లో పలు సమస్యలను ఎదుర్కొంటారు. అలాగే యజమానితో ఉన్న సత్సంబంధాలు కూడా చెడిపోతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు భారీగా నష్టపోతారు. ఆ సమయంలో ఎటువంటి పెట్టుబడులు పెట్టకుండా ఉండటం ఉత్తమం. లేదంటే ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోతోంది.

తుల రాశి : సూర్యగ్రహణం చెడు ప్రభావం తులా రాశి వారిపై ఎక్కువగా ఉంటుంది. వీరికి ధన నష్టం ఉంటుంది. ఆ సమయంలో ఎవరికీ అప్పు ఇవ్వకుండా ఉండటం మంచిది. పెట్టుబడి గురించి అసలు ఆలోచించనే కూడదు. ఉన్న డబ్బును ఆదా చేయడం ఉత్తమం. కుటుంబంలో వివాదాలు వస్తాయి కాబట్టి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి.
మేషరాశి :
ఏప్రిల్ 20న ఏర్పడబోయే సూర్యగ్రహణం మేషరాశి వారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తుతాయి. అంతేకాకుండా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మానసిక ఒత్తిడికి గురవడంవల్ల ఆరోగ్యం పాడవుతుంది. జీవితంలో అసలేం చేయాలి? అనేవాటిపై ఒక స్పష్టత రాదు.

వృషభం:
ఈరాశివారికి ఖర్చులు పెరుగుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కెరీర్లో అడ్డంకులు తగులుతాయి. అనారోగ్యంతోపాటు కుటుంబంలో టెన్షన్ వాతావరణాన్ని ఎదుర్కొంటారు.












Click it and Unblock the Notifications