అజ్ఞానంతో కూడిన గర్వం వలన సమస్తం వినాశనం!
డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ ఇంటర్నేషనల్ జ్యోతిష్యులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.
హైదరాబాద్: అహంకారం అనేది ఏక్కడో ఉండదు.అజ్ఞాతంగా మనలోనే ఉంటుంది. దీని వలన అన్ని అనర్థాలకూ మూలకారణం అవుతుంది. ఆత్మీయుడిగా నమ్మిస్తాడు. కానీ ఆగర్భశత్రువై నిండా ముంచేస్తాడు. అందలమిక్కిస్తానని ఆశలు కల్పిస్తాడు. కానీ మన అభివృద్ధికి అతనే ఆటంకమవుతాడు. మనలో ఏ విశేషమూ లేకపోయినా, ఎంతో విఖ్యాతులమని విర్రవీగేలా చేస్తాడు.
మనలోని వాపును కూడా మహా బలమని భ్రమింపచేస్తాడు.అణుకువతో ఓ మెట్టు దిగుదామని అంతరంగం చెబుతున్నా, అది అవమానమంటూ అడ్డుపడతాడు.ఆ అంతర్యామికీ, మన అంతరాత్మకూ మధ్య అతనే అడ్డుగోడవుతాడు.ఆ అదృశ్య, అతి ప్రమాదకర అంతఃశత్రువు మరెవరో కాదు అహంకారం.

వినమ్రతకు అది అనాదిగా బద్ధ వ్యతిరేకం.అహంకారికి భగవంతుడు ఆమడ దూరంలో ఉంటాడు.ముందు నేను అనే మాయ నుంచి నువ్వు బయటపడితే నిన్ను నా దరికి చేర్చుకుంటానంటాడు.అందుకే ఆధ్యాత్మిక సాధనల లక్ష్యం కూడా ఆత్మను పొందడం కాదు. అహంకారాన్ని పోగొట్టుకోవడం.అయినా నేను నాది అని గర్వించేటంత ప్రత్యేకత మనలో ఏముంది గనక ? సామ్రాజ్యాలను ఏలిన సార్వభౌములే శ్మశానాల్లో సమాధులై పోయారు.మరి మనమెంత ?
మనం తినే తిండిలో కారం ఎక్కువైతే శరీరంలోని రక్తాన్ని పీల్చేస్తుంది.అదే అహంకారం ఎక్కువైతే మానవత్వాన్నే పీల్చేస్తుంది.అహంకారం ఎవరిలో ప్రవేశిస్తుందో అలాంటి వారి గతి అధోగతే. చెదపురుగు పట్టిన వస్తువు ఏ విధంగా పనికిరాకుండా పోతుందో అహంకారం అనే చెదపురుగు పడితే మానవవత్వం నశించిపోతుంది.
వెర్రి ఆలోచనలు కలిగిస్తుంది. మానవత్వం నుండి రాక్షసత్వంలోకి నెట్టేస్తుంది.మనషి బ్రతికి ఉన్నప్పుడే నేను ఇది,నేను అది అని విర్రవీగడం వరకే చచ్చాక శ్మశానంలోరాజైన,సేవకుడైన,ధనికుడైన,పెదవాడైన పూడ్చే మట్టి అందరికి ఒక్కటే స్థాయిలను బట్టి మట్టి,కట్టే విడి విడిగా ఉండవు,అంతా ఒకటే మట్టి. అందుకే ఈ భూమి మీద బతికి ఉన్నన్ని రోజులు మంచి లక్షణాలతో ధాన ధర్మ గుణంతో అందరిని గౌరవిస్తూ సాధ్యమైనంత వరకు పలువురి సహయపడుతూ కాలం గడిపిన వారిని అందరూ ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారు.వారికి పరంలో తప్పక సద్గతి లభిస్తుంది జై శ్రీమన్నారాయణ.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!