2024 ఏప్రిల్ వరకు ఈ రాశులకు అన్నీ కష్టాలే

పురాణాల ప్రకారం బృహస్పతి దేవతల గురువు. జ్ఞానం, వైవాహిక జీవితం, సంతానానికి కారకుడిగా భావిస్తారు. కొత్త సంవత్సరానికి కొన్ని గంటల ముందే గురుడు మేషరాశిలో దారితప్పాడు. ప్రస్తుతం అక్కడ ప్రత్యక్షంగా కదులుతూ నాలుగు నెలలపాటు అక్కడే ఉంటాడు. తర్వాత మే ఒకటో తేదీన వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు. రాబోయే నాలుగు నెలలు మూడు రాశులవారు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. వాటి వివరాలు తెలుసుకుందాం.

వృశ్చిక రాశి : ఈ రాశివారి కుటుంబంలో గొడవలు తలెత్తుతాయి. జీవిత భాగస్వామితో మనస్పర్థల కారణంగా దూరం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారే అవకాశం ఉంది. ప్రేమ జీవితంలో విఫలమవుతారు. వ్యాపారస్తులకు భారీ నష్టాలున్నాయి. తద్వారా అనారోగ్యానికి గురవుతారు. మానసిక ఒత్తిడికి లోనవడంతో కెరీర్ లో అనేక అడ్డంకులు ఎదురవుతాయి. కుటుంబంలో ప్రతి చిన్న విషయానికి వివాదాలు రేకెత్తుతుంటాయి.

these zodiac sign people are very unlucky due to Guru Rashi Parivartana 2024

తుల రాశి : ఈ రాశికి అధిపతి శుక్రుడు. గురుడు, శుక్రుడు శత్రువులు. వీరిద్దరికీ పడకపోవడంవల్ల బృహస్పతి ప్రత్యక్ష సంచారం తులారాశి వారిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఉద్యోగంలో ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఆర్థికంగా నష్టపోయే అవకాశం కనపడుతోంది. ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు నష్టాలను మిగులుస్తాయి. సంతానం కోసం మరికొంత సమయం ఎదురు చూడాల్సి ఉంటుంది.

మకర రాశి : బృహస్పతి సంచారంవల్ల వీరికి ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే ప్రమాదాలబారిన పడతారు. వ్యక్తిగతంగాకానీ, కుటుంబంతో కలిసికానీ తీర్థయాత్రకు లేదంటే విహారయాత్రకు వెళతారు. కెరీర్ లో పలు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆదాయం తక్కువగా ఉండి అప్పుల ఊబిలో కూరుకుపోయే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+