బృహస్పతి తిరోగమనంతో ఊహించని మార్పులు.. ఈ రాశులవారు మహారాజులే
వేద జ్యోతిష్యం ప్రకారం బృహస్పతి అన్ని గ్రహాలకు గురువుగా పరిగణిస్తారు. ధనుస్సు, మీనరాశివారిని పాలిస్తుంది. ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేయడానికి గురువుకు 12 నెలల సమయం పడుతుంది. మేషరాశిలో తిరోగమన స్థితిలో ఉన్న గురువు డిసెంబరు 31వ తేదీ వరకు అక్కడే ఉంటాడు. 12 సంవత్సరాల తర్వాత మేషరాశిలో గురువు తిరోగమనం చేయడంవల్ల కొన్ని రాశులవారికి అనుకూల ఫలితాలు కలుగుతాయని పండితులు తెలియజేస్తున్నారు. వాటి వివరాలు తెలుసుకుందాం.
మేష రాశి : దేవ గురువు తిరోగమన స్థితిలో ఉండటంవల్ల ఈ రాశివారికి అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. ఆర్థిక పరిస్థితుల్లో కోరుకున్న మార్పులు వస్తాయి. భవిష్యత్తులో కూడా ఊహించని లాభాలున్నాయి. వ్యాపారాలు చేసేవారికి కలిసివస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. గతంలో ప్రారంభమై నిలిచిపోయిన పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది.

సింహ రాశి : పెట్టిన పెట్టుబడుల వల్ల భారీ లాభాలను ఆర్జిస్తారు. తల్లిదండ్రుల నుంచి ఊహించనిరీతిలో మద్దతు లభిస్తుంది. దీనివల్ల ఆత్మవిశ్వాసం ఇనుమడించి పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. పెండింగ్ లో ఉన్న పనులన్నింటినీ పూర్తిచేస్తారు. పోటీపరీక్షలకు సిద్ధపడుతున్న విద్యార్థులు విజయాలు అందుకుంటారు. జీవిత భాగస్వామి సలహాతో చేసే పనులు విజయవంతమవుతాయి.
మీన రాశి :ఊహించని లాభాలున్నాయి. డిసెంబరు 31వ తేదీ వరకు సానుకూల ఫలితాలే పొందుతారు. కుటుంబ సభ్యులతో అధిక సమయం వెచ్చిస్తారు. వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది. జీవిత భాగస్వామి నుంచి ఊహించనిరీతిలో మద్దతు దొరుకుతుంది.












Click it and Unblock the Notifications