వాస్తు ప్రకారం ఇంట్లో స్పటిక లింగం ఉండొచ్చా? లేదా?

హిందూ సంప్రదాయంలో విగ్రహారాధనకు అత్యున్నత స్థానం ఉంది. లయకారుడైన పరమశివుడిని పూజించడానికి భక్తులు ఇళ్లలోనే శివలింగాలను ప్రతిష్టించుకుని నిత్యం అర్చనలు చేస్తుంటారు. సాధారణంగా శివలింగాలు రాయి లేదా వివిధ లోహాలతో తయారు చేసినవి ఎక్కువగా కనిపిస్తాయి. కానీ, వీటన్నింటికంటే అత్యంత విశిష్టమైనది, పవిత్రమైనది "స్పటిక శివలింగం". అసలు స్పటిక శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా? ఒకవేళ ఉంచితే ఎలాంటి నియమాలు పాటించాలి? దానివల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

స్వచ్ఛతకు ప్రతిరూపం.. స్పటిక లింగం
స్పటికం అంటేనే పవిత్రతకు, నిష్కల్మషమైన స్వచ్ఛతకు చిహ్నం.
అంతటి దివ్యమైన స్పటికం శివరూపాన్ని సంతరించుకుంటే, ఆ శక్తి అనంతం అవుతుంది.
ఇంట్లో స్పటిక శివలింగాన్ని ఉంచి పూజించడం వల్ల
ప్రతికూల శక్తులు నశించి, సానుకూల శక్తి విపరీతంగా పెరుగుతుందని
వాస్తు, జ్యోతిష నిపుణులు బలంగా చెబుతున్నారు.
ఈ లింగారాధన వల్ల ఆ ఇల్లే ఒక దేవాలయంగా మారుతుంది.

Vastu Tips According to the principles is it permissible to keep a crystal Lingam in the home

ఇంట్లో ఉంచేటప్పుడు పాటించాల్సిన ముఖ్య నియమాలు
ఇంట్లో శివలింగం ఉండవచ్చా అనే సందేహం చాలామందికి ఉంటుంది.
శాస్త్రాల ప్రకారం నిరభ్యంతరంగా ఉంచుకోవచ్చు,
కానీ కొన్ని కచ్చితమైన నియమాలను పాటించడం తప్పనిసరి
ఇంట్లో పూజించే శివలింగం పరిమాణం చాలా పెద్దదిగా ఉండకూడదు.
కేవలం మన బొటనవేలు సైజులో మాత్రమే ఉండాలి.
అంతకంటే పెద్దగా ఉంటే గృహస్థులకు వాస్తు రీత్యా మంచిది కాదు.
స్పటిక శివలింగాన్ని ఇంటికి ఈశాన్య మూల లేదా ఉత్తర దిశలో
ప్రతిష్టించి పూజించడం అత్యంత శ్రేయస్కరం.
శివలింగాన్ని నేరుగా నేలపై ఉంచకూడదు.
ఒక చిన్న పాలరాతి పీఠంపై లేదా వెండి గిన్నెలాంటి పాత్రలో ఉంచాలి.
వీలైతే లింగంపై నిరంతరం నీటి చుక్కలు పడేలా 'జలధార' ఏర్పాటు చేయడం మహా పుణ్యం.
స్పటిక లింగానికి రోజూ పాలు, స్వచ్ఛమైన నీరు లేదా పండ్ల రసాలతో అభిషేకం చేయాలి.
అభిషేకం పూర్తయిన తర్వాత మెత్తటి వస్త్రంతో శుభ్రం చేసి,
పువ్వులతో అలంకరించి, ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి.

లభించే అద్భుత ఫలితాలు
నిత్యం స్పటిక శివలింగాన్ని ఆరాధించడం వల్ల కేవలం ఆధ్యాత్మిక ఉన్నతే కాదు,
భౌతిక జీవితంలోనూ ఊహించని మార్పులు వస్తాయి
ఏ ఇంట్లో స్పటిక లింగానికి క్రమం తప్పకుండా పూజలు జరుగుతాయో,
అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుంది. సంపదకు, ధాన్యానికి లోటుండదు.
ఇంట్లోని వారి మానసిక ఒత్తిడి తగ్గి, ప్రశాంతత లభిస్తుంది.
దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి.
రోజూ ఈ లింగానికి అభిషేకం చేయడం వల్ల ఇంట్లో ఉన్న పిల్లల్లో జ్ఞాపకశక్తి,
చదువుపై ఏకాగ్రత అద్భుతంగా పెరుగుతాయి.
వ్యాపారాల్లో వచ్చే ఆటంకాలు, నష్టాలు తొలగిపోయి లాభాల బాట పడతాయి.
ఇంటికి ఉన్న ఎలాంటి వాస్తు దోషాలైనా ఈ స్పటిక కాంతికి కరిగిపోతాయి.

శ్రావణ మాసం శివారాధనకు మహత్తర సమయం
త్వరలోనే పవిత్రమైన శ్రావణ మాసం (జూలై 25 నుండి) ప్రారంభం కానుంది.
శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ మాసంలో స్పటిక లింగ పూజ విశేష ఫలాన్ని ఇస్తుంది.
ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం ఉదయాన్నే లేచి, ఇల్లంతా శుభ్రం చేసుకుని,
శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేయాలి.
భోళాశంకరునికి ఇష్టమైన బిల్వ పత్రాలు , జిల్లేడు పూలతో అలంకరించి,
నైవేద్యం సమర్పించాలి. పూజ సమయంలో వీలైనంత ఎక్కువసార్లు
"ఓం నమః శివాయ" అనే పంచాక్షరి మంత్రాన్ని జపించాలి.
దాంతో పాటు శివ అష్టోత్తరాలు, శివ సహస్రనామ స్తోత్రాలు పఠిస్తే
ఆ సదాశివుని అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు, సకల శుభాలు సిద్ధించడం ఖాయం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+