శాస్త్ర పద్దతిలో భోజనం: ఏవైపు ముఖం పెట్టి తినాలి?, అలా మాత్రం అసలు తినకూడదు..
ఎట్టి పరిస్థితిలోనైనా తినే కంచంను ఒడిలో పెట్టుకుని అన్నం తినరాదు.
భగవంతుడు సృష్టించిన ఈ సృష్టిలో ప్రాణి జీవించడానికి ఆహరం తప్పని సరిగా తీసుకోవలసిందే.ఈ సృష్టిలో ప్రతి ప్రాణి ప్రకృతిలో లభించే ఆహర పదార్ధాలను సహజ సిద్ధంగానే తిని ఆరోగ్యంగా జీవిస్తున్నాయి, కాని మానవుడు మాత్రం దానికి భిన్నంగా తన జిహ్వాచాపల్యం కోసం రుచులకు అలవాటుపడి ప్రకృతి సంపదను మంట పెట్టి మాయ చేస్తున్నాడు,మధన పడుతున్నాడు.
మనం తిన్న ఆహారం అమృతాఆహారం కావాలని మానవ జాతికోరకు శాస్త్రం కొన్ని సూచనలు ఇచ్చింది, శాస్త్ర పద్ధతిలో భోజనం చేస్తే ఆరోగ్యంగా ఉంటారు. కోటి విద్యలు కూటి కోరకే అన్నారు పెద్దలు. మనిషి ఎంత కష్ట పడ్డా పట్టేడు అన్నం కోసమే కదా? తినే అన్నం కోరకు కాస్త ప్రశాంత మైన సమయం ఇవ్వాలి.
తిన్న అన్నం ఒంటికి పట్టాలి కదా మరి! ప్రస్తుత కాలంలో అనారోగ్యాలు ఎందుకు కలుగు తున్నాయి? మనం ఆహరం తీసుకునే సమయంలో పద్ధతులను పాటించక పోవడమే ప్రధాన కారణం. మనం తిన్న అన్నం అమృత తుల్యం కావలంటే ఏమి చెయాలో తెలుసుకుందాం.

భోజనానికి ముందు శుభ్రంగా సబ్బుతో చేతులు,కాళ్లు కడుక్కోవాలి. భోజనానికి అరటి ఆకు శ్రేష్టం, అరటిఆకులో భోజనం చేయడానికి కారణం అన్నంలో ఒకవేళ విషం కలిస్తే ఆకు నలుపు రంగుగా మారిపోతుంది, వేడి అన్నం వడ్డిస్తే ఆకులోని
అనేక రకాల పోషకాలు అరటిఆకులో ఉన్నందున మంచి రుచిని కలిగిస్తాయి.
అరటి ఆకులు అందుబాటులో లేనివారు మోదుగ ఆకులతో తయారు చేసిన విస్తరి ఆకులు కూడా ఆరోగ్యమే. అరటి,విస్తరి ఆకులో భోజనం చేయడం వలన ఆకలి పెరుగుతుంది,ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఆర్ధిక స్థోమత కలిగిన వారు వెండి ప్లేట్ లో, శక్తిలేని వారు స్టీల్ ప్లేట్ లలో భోజనం చేస్తే కూడా ఆరోగ్యం కలుగుతుంది . ప్లాస్టిక్ విస్తర్లు,ప్లేట్లు ,అల్యూమినియం మరియు ఇతర లోహంతో చేసినవాటిలో అన్నం తింటే శరీరానికి కీడును కలిగించి అనారోగ్యం పాలు చేస్తాయి.
ఆహరం తినుటకు తూర్పునకు ముఖం పెట్టి భోజనం చేయడం అనేది ఎక్కువ ప్రాముఖ్యం కలిగిఉంది. భూమిపై చాప వేసుకోని కూర్చోవాలి,కూర్చోలేనివారు పీట, కుర్చీలపై కూర్చున్నా మనకంటే పై స్థానంలో అన్నం ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి.భోజనం పూర్తి అయ్యేవరకు మౌన "ప్రశాంతగా" ఉండాలి. టివి చూస్తు, అనవసరమైన విషయాలు మాట్లాడుకుంటునో తినరాదు.
మనం కూర్చున్నతర్వాతనే తినే పదార్ధాలు వడ్డించుకుని తినాలి,అన్ని వడ్డించిన విస్తరి,పళ్లెం ముందు కూర్చోరాదు. మనం తినడానికి పెట్టుకున్న ఆహారపదార్ధాలో ఒక ముద్ద తీసి దైవానికి నివేదన అని భావించి పక్కన పెట్టి తినాలి తర్వాత ఆ అన్నం ముద్దను పక్షులకు కాని జంతువులకైన వేయాలి.
నీళ్ళ గ్లాసును కుడి వైపు పెట్టుకోని అవసరం అయితే ఎడమ చేతుతో నిదానంగా కోంచం కొంచెం త్రాగాలి, నీళ్ళను బోజనానికి అరగంట ముందు,తర్వాత తాగితేనే మంచి ఆరోగ్యం కలుగుతుంది.
అన్నము తింటున్నప్పుడు అన్నాన్నేకాని ,ఆ అన్నం వండిన వారినికాని, వడ్డించేవారినికాని తిట్టరాదు,వంకలు పెట్టరాదు.భోజన సమయంలో ఏడుస్తూ తినుట,నవ్వులాట,తగువులాట,తిట్టుకొనుట,గేలిచేయుట, మొదలగునవి చేయకూడదు.
ఎట్టి పరిస్థితిలోనైనా తినే కంచంను ఒడిలో పెట్టుకుని అన్నం తినరాదు.అన్నాన్ని చేతితో తింటేనే మంచిది స్పూన్స్ వాడకూడదు. చేతి వేళ్ళను నోటిలో పెట్టుకోని నాకకూడదు. హాడావిడిగా తినకూడదు. ప్లేటును,ఆకును మొత్తం ఊడ్చుకొని తినడం మంచిది కాదు.మనం తింటున్నప్పుడు ఏ మానసిక స్థితిలో ఉండి తింటామో తిన్న తర్వాత ఆ ఆహార పదార్థాలు అరిగే వరకు శరీరాన్ని,మనస్సును అదే స్థితిలో ఉంచుతాయి.
ఇది గమనిస్తే ఆరోగ్యం మన వేంటనే ఉంటుంది.భోజన అనంతరము తిన్నఎంగిలి ఆకులు,కంచాలు ఎవరైతే తీస్తారో వారికి దక్కిన విశేష పుణ్యఫలం డబ్బులు ఖర్చు చేసిన అన్నదాతకు కూడారాదు.
తమిళనాట ఎవరు తిన్న ప్లేట్ వారే తీసి కడిగి వేస్తారు, ఒకరి సేవా ఋణం మంచిది కాదని వారి భావన,నార్త్ ఇండియన్స్ కూడా ఈ పద్ధతే పాటిస్తారు.ఈ విధంగా ఎవరైతే శాస్త్ర పద్ధతితో ఆహరం తింటారో వారికి ఆరోగ్యంతో బాటు ఆత్మీయతలు కూడా కలిగి సుఖంగా జీవిస్తారు.
డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.












Click it and Unblock the Notifications