శివరాత్రికి ముందే శుక్రుడి సంచారంతో ఈ రాశులు జమిందారులే

సంపదకు, ఐశ్వర్యానికి కారకుడైన శుక్రుడు ఈనెల ఏడోతేదీన శనిదేవుడి రాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈనెల 30వ తేదీ వరకు అక్కడే ఉంటాడు. దీనివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా కొన్ని రాశులవారికి మంచి ప్రయోజనాలు లభిస్తాయని చెబుతున్నారు. వాటి వివరాలను తెలుసుకుందాం.

కుంభ రాశి: లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఊహించనిరీతిలో ఈ రాశివారికి మంచి ప్రయోజనాలు దక్కనున్నాయి. వైవాహిక జీవితం శృంగార భరితంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా ఈ సమయం బాగా కలిసిరానుంది. ఒంటరి జీవితం గడుపుతున్నవారికి వివాహానికి సంబంధించిన ప్రతిపాదనలను రాబోతున్నాయి. ఆధ్యాత్మిక పరమైన విషయాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో పనిచేసేవారు విజయవంతమవుతారు.

venus transits aquarius on day before shivratri 2024

తులా రాశి: శుక్రుడి సంచారం ఈ రాశివారి నాలుగో స్థానంలో జరగనుంది. దీనివల్ల పూర్వీకుల నుంచి ఆస్తులు లభిస్తాయి. తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా వ్యవహరిస్తున్నారు. దీనివల్ల వీరి కోరికలన్నీ సులువుగా నెరవేరతాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటంతోపాటు సమస్యల నుంచి బయటపడతారు. ప్రయాణాలు చేయడంవల్ల కూడా ఆర్థికంగా కలిసిరానుంది.

వృషభ రాశి: నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. ఊహించని రీతిలో ధనం చేతికి అందుతుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోతే అనారోగ్య సమస్యలు తీవ్రమవుతాయి. వ్యాపారవేత్తలు, మీడియా, కళలు, సినిమా రంగాల్లో ఉన్న వ్యక్తులకు లాభాలున్నాయి. మరోవైపు ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాలపట్ల ఆసక్తి కలగడంతోపాటు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+