చీకటిని పారద్రోలే దీపాల పండుగ.. దీపావళీని ఎందుకు జరుపుకొంటామంటే
డా.యం.ఎన్.చార్య - హైదరాబాద్ - ఫోన్: 9440611151
మనం దీపావళిని ఎందుకు జరుపుకుంటాం? ఈ పండుగ సంతోషంగా ఉండేలా చేస్తుంది. అంతేకాక ఒక మంచి సమయం అయిన శీతాకాలంలో రావడం వలన ఎక్కువగా అస్వాదిస్తాం.ఈ సమయంలో దీపావళి జరుపుకోవటానికి అనేక పౌరాణిక మరియు చారిత్రక కారణాలు ఉన్నాయి.ఇతరులు కూడా దీపాలతో గొప్ప ఉత్సవంగా జరుపుకుంటారు.
1. లక్ష్మి దేవి పుట్టినరోజు సంపద యొక్క దేవత లక్ష్మి దేవి,సముద్ర మథనం సమయంలో కార్తీక మాసంలో అమావాస్య రోజున అవతరించారు. అందుకే లక్ష్మిదేవికి దీపావళికి సంబంధం ఉంది.
2. విష్ణువు లక్ష్మీదేవిని కాపాడిన రోజు దీపావళి రోజున విష్ణువు తన ఐదవ అవతారం అయిన వామన అవతారంలో బలి చక్రవర్తి చేర నుండి లక్ష్మి దేవిని కాపాడెను. ఇది దీపావళి రోజున లక్ష్మి పూజలు చేయటానికి మరో కారణం.
3.నరకాసురుడుని చంపిన రోజు దీపావళి ముందు రోజు. రాక్షస రాజు నరకాసురుడుని చంపి మరియు తన నిర్బంధంలో ఉన్న 16,000 మంది మహిళలను శ్రీ కృష్ణుడు రక్షించిన రోజు .ఈ స్వేచ్ఛ యొక్క వేడుకను దీపావళి రోజుతో సహా రెండు రోజుల పాటు జరుపుకుంటారు.

4. పాండవులు వనవాసం నుండి తిరిగి వచ్చిన సమయం.మహాభారత ప్రకారం పాండవులు పాచికలు (జూదం) ఆట లో కౌరవుల చేతిలో పరాజయం పొందిన ఫలితంగా 12 సంవత్సరాల గ్రామ బహిష్కరణకు గురి అయ్యారు. పాండవులు 12 సంవత్సరాల తర్వాత కార్తీక అమావాస్య నాడు కనిపించారు.
5. రాముని యొక్క విజయం గొప్ప ఇతిహాసమైన రామాయణంలో శ్రీరాముడు,సీతా మరియు లక్ష్మణుడు రావణ సంహారం తర్వాత లంక నుండి అయోధ్యకు కార్తీక అమావాస్య రోజున తిరిగి వచ్చారు. అయోధ్య పౌరులు ఆ రోజున మట్టి దీపాలతో మొత్తం నగరంను ఎప్పుడు ప్రకాశవంతముగా ఉండేలా అలంకరించారు.
6. విక్రమాదిత్యుడు పట్టాభిషేకం గొప్ప రాజైన విక్రమాదిత్యుడికి దీపావళి రోజున పట్టాభిషేకం జరిగినది. అందుకే దీపావళి ఒక చారిత్రాత్మక సంఘటన అయింది.
చీకటికి వెలుగులు సాధించి, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. హిందువులే కాకుండా అన్ని మాతల వారు అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో దీపావళికి ప్రథమ స్థానం ఉంది.ఉత్తర భారత దేశాల్లో ఈ పండుగను అంత్యంత వైభవంగా ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటారు.
ఈ పండుగ ప్రతియేటా ఆశ్వయుజ అమవాస్య రోజున దీపావళి వస్తుంది. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్థశి.దీన్ని నరక చతుర్థశిగా జరుపుకుంటారు. ఇలా ప్రాశస్తిగాంచిన పండుగకు సంబంధించి ఒక పురాణకథ కూడా ఉంది.కృతయుగంలో హిరణ్యాక్షుని వధించిన వరాహస్వామికి, భూదేవికి అసుర సంధ్యాసమయంలో నరకుడు అనే రాక్షసుడు జన్మించాడు.
ఈ రాక్షసుడు ప్రజలను పట్టి పీడిస్తుండేవాడు.ప్రజలను హింసకు గురిచేస్తున్న నరకుడిని అంతమొందించేందుకు సత్యభామ సమేతంగా శ్రీకృష్ణుడు వెళతాడు.వారి మధ్య జరిగిన భీకరపోరులో శ్రీకృష్ణుడు మూర్చబోగా సత్యభామ నరకుడిని వధిస్తుంది.నరకాసురుడి పీడ విరగడైందన్న సంతోషంతో ప్రజలు సంబరాలు జరుపుకుంటారు. ఈ సంబరాలు జరుపుకునే రోజు అమావాస్య కావడంతో చీకటిని పారద్రోలుతూ ప్రజల దీపాలతో తోరణాలు వెలిగించి, బాణాసంచా కాల్చి వేడుక చేసుకున్నారు.
కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది. అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెపుతోంది. ఈ పవిత్ర పర్వదినం రోజున ఆబాలగోపాలం కొత్త వస్త్రాలు ధరించి లక్ష్మీదేవికి పూజచేస్తారు. మట్టితో చేసిన ప్రమిదల్లో నూనె, నేతి వంటివాటిని పోసి దీపాలను వెలిగిస్తారు.
ఇంటిల్లిపాది కలిసి బాణాసంచా కాల్చుతారు. టపాకాయలు, విష్ణుచక్రాలు, తారాజువ్వలు, చిచ్చుబుడ్లు, విష్ణు చక్రాలు, భూచక్రాలు,కాకరవొత్తులు కాల్చుతుంటే కళ్లుమిరుమిట్లు గొలుపుతాయి.అలాగే పెద్ద శబ్దాన్ని ఇచ్చే టపాకాయలు చెవులు చిల్లుల పడేలా శబ్దం చేస్తాయి.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications