కృష్ణాలో లారీబోల్తా-నలుగురు మృతి
విజయవాడః కృష్ణాజిల్లాలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. చేపలు పట్టేందుకు 45 మంది మత్స్య కారులను తీసుకువెళుతున్నమినీలారీ బోల్తా పడడంతో ఈ దుర్ఘటన జరిగింది. పోలుకొండ-రుద్రపాకల మధ్య ఈ దుర్ఘటన జరిగింది.
45 మంది మత్స్యకారులు చేపలు పట్టేందుకు ఓమినీలారీలో బయలు దేరారు. వేగంగా వెళుతున్నమినీలారీలో ఒక్కసారిగా సాంకేతిక లోపం తలెత్తింది. దీనితో లారీ హఠాత్తుగా బోల్తాపడింది. ఈ దర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారినివిజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications