వాజ్‌ పేయికి అజిత్‌ సింగ్‌షాక్‌!

ఘజియాబాద్‌ః ఎన్డీఏ ప్రభుత్వ సారధి, ప్రధాని వాజ్‌ పేయికి కొత్త కష్టం వచ్చిపడింది. ఉత్తరప్రదేశ్‌ ను రెండుగా చీల్చి హరిత్‌ ప్రదేశ్‌ ఏర్పాటు చేయకపోతే తాను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి, రాష్ట్రయ లోక్‌ దళ్‌ అధ్యక్షుడు అజిత్‌ సింగ్‌ శనివారం హెచ్చరించారు.
రానున్న ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో బిజెపి విజయావకాశాలు మెరుగుపరచేందుకు ప్రధాని వాజ్‌ పేయి అజిత్‌ సింగ్‌ ను ఇటీవలే మంత్రివర్గంలో చేర్చుకున్నారు. నిన్నటి వరకు మౌనంగా వున్న అజిత్‌ సింగ్‌ మళ్ళీ హరిత్‌ ప్రదేశ్‌ పాట పాడడంతో వాజ్‌ పేయికి పెద్ద చిక్కువచ్చిపడింది.

హరిత్‌ ప్రదేశ్‌ సాధనకే తాను వాజ్‌పేయి సర్కార్‌ లో చేరినట్లు అజిత్‌ సింగ్‌ శనివారం ఘజియాబాద్‌ సమీపంలోని మురద్‌ నగర్‌ లో ప్రకటించారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ లో అలహాబాద్‌ హైకోర్టు ప్రత్యేక బెంచ్‌ ఏర్పాటు చేయాలనే న్యాయవాదులకు అజిత్‌ సింగ్‌ మద్దతు ప్రకటించారు. తెహల్కా గండం నుంచి ఎలాగో బయటపడి, గాడితప్పిన ఎన్డీఏ సహచరులను రాజీనామాఅస్త్రం సంధించి మరీ దారికి తెచ్చుకున్న వాజ్‌పేయికి రోజుకో గండం ఎదురవుతున్నది.

కేంద్ర క్యాబినెట్‌ లో స్థానం లభించని ఢిల్లీకి చెందిన నలుగురుసీనియర్‌ ఎం.పి.లు అలకపాన్పు ఎక్కడంతో వాజ్‌ వేయి శనివారం వారితో మాట్లాడి సర్ది చెప్పారు. ఆవివాదం సద్దుమణగక ముందే క్యాబినెట్‌ మంత్రిఅయిన అజిత్‌ సింగ్‌ ఇలా రణభేరి మోగించడం వాజ్‌పేయికి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌ లో బిజెపి కోలుకోకుండా చేసేందుకు కాంగ్రెస్‌, సమాజ్‌ వాది పార్టీలు కుట్రపన్ని అజిత్‌ ను తిరిగి హరిత్‌ ప్రదేశ్‌ పల్లవిఅందుకొనేలా చేశారనే విమర్శలు వస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+