చెన్నయ్ లో కల్తీసారాకు 12మంది బలి
చెన్నయ్‌ః తమిళనాడు రాజధాని చెన్నయ్ నగరం శివార్లలోని అంబత్తూరులో శుక్రవారం రాత్రి కల్తీ సారా తాగి 12 మంది దుర్మరణం పాలయ్యారు. కల్తీ సారా తాగి మరణించిన వారిలో ఓ మహిళ కూడా వుంది. ఈ దుర్ఘటనలో మరో ఆరుగురు ఆస్పత్రి పాలయ్యారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా వున్నదని అధికారులు చెప్పారు.
ఈ సారాను ఆంధ్రప్రదేశ్ సరిహద్దు గ్రామాల నుంచి తీసుకవచ్చిసేవించినట్లు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకువచ్చిన సారా పాకెట్లను ఓపెళ్ళి విందు సందర్భంగా వీరు సేపించారు. తమిళనాడులో కూడాసారాపై నిషేధం వుండడంతో ఆంధ్రప్రదేశ్ లోని సరిహద్దు గ్రామాల నుంచి సారా తెచ్చుకొని వుంటారని పోలీసులు చెబుతున్నారు. జయలలిత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం కల్తీ సారా తాగి ఇంతమంది మరణించడం ఇదే ప్రథమం.
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న తమిళనాడు ప్రభుత్వంసారా, కల్లుపై నిషేధాన్ని సడలించే సూచనలు కనిపిస్తున్నాయి. కల్తీ సారా తాగి మరణించే వారి సంఖ్య అధికం కావడం,సారా, కల్లు ను అనుమతించడం వల్ల ప్రభుత్వానికి బాగా ఆదాయం వచ్చే అవకాశాలున్నందువల్ల నిషేధాన్ని ఎత్తివేస్తారని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications