ఇంజనీరింగ్ కన్నా ఆస్ట్రానమీమిన్న
నెల్లూరుః శ్రీహరికోట అంతరిక్షపరిశోధనా కేంద్రం (షార్) నుంచి త్వరలో వాణిజ్యపరమైనసేవలు ప్రారంభించనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ నారాయణ ప్రకటించారు. ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్ పై మూడు రోజుల జాతీయ సదస్సును నారాయణ శనివారం ప్రారంభించారు. 3 ఉపగ్రహాలను తీసుకువెళ్ళే కీలకమైన పి.ఎస్.ఎల్.వి.-సి3 నిఅక్టోబర్ 15 నాటికి ప్రయోగించేందుకు అన్ని సన్నాహాలు చేస్తున్నట్లు ఆయనవివరించారు.
ఇంజనీరింగ్ పై మితిమీరిన మమకారాన్ని వదులుకొని ఉపాధితో పాటు శాస్త్రపురోగతికి ఎంతగానే ఉపయోగపడే ఖగోళశాస్త్రంపై యువత దృష్టి సారించాలని నారాయణ పిలుపునిచ్చారు. ఆంధ్రరాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కళాశాలలు పుట్టగొడుగుల్లా వస్తున్నాయని, క్రమేణా ఇంజనీరింగ్ కు ఆదరణ తగ్గుతున్నదని సదస్సులో వక్తలు అభిప్రాయ పడ్డారు. ఇంజనీరింగ్ తో పాటు ఎంతో ఉపయోగకరమైన ఖగోళ శాస్త్రం వైపు యువత దృష్టి సారించాలని, ప్రభుత్వాలు కూడా ఇందుకు నడుం కట్టాలని సదస్సు కోరింది.












Click it and Unblock the Notifications