బిజెపి ఎంపీల అలక
న్యూఢిల్లీః ఢిల్లీ బిజెపిలో సంక్షోభం నెలకొంది. తమ సీనియార్టీని పక్కనబెట్టి తమకంటే జూనియరైన విజయ్ గోయెల్‌ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నందుకు నిరసనగా శుక్రవారం నాడు నలుగురు ఎంపీలు తమ పార్టీ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధపడినట్టుగా తెలిసింది.
నవంబర్‌లో ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్‌కు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ తాజాసంక్షోభం బిజెపి అగ్రనాయకత్వాన్ని తీవ్రంగా కలవరపర్చింది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రులుసాహెబ్‌సింగ్ వర్మ, మదన్ లాల్ ఖురానా, మరోసీనియర్ నేత లాల్ బిహారీ తివారీ పార్టీ అధికార ప్రతినిధివికె మల్హోత్ర పార్టీ అధ్యక్షుడు జనా కృష్ణమూర్తిని కలసి తమ మనోభిప్రాయలను వెల్లడించినట్టుగా తెలిసింది. తమను ఢిల్లీ రియల్‌ఎస్టేట్ ముఠా మద్దతుదారులుగాపేర్కొంటూ కేంద్ర మంత్రి జగ్‌మోహన్ చేసిన వ్యాఖ్యల పట్ల కూడావీరు పార్టీ నేత వద్ద ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. జనా వారిని బుజ్జగించి పంపినట్టుగా తెలిసింది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!