గుప్తా, పటౌడీకిసి.కె. నాయుడు అవార్డు
న్యూఢిల్లీః భారత క్రికెట్ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సి.కె నాయుడు అవార్డు స్పిన్ మాంత్రికుడు సుభాష్ గుప్తే, స్టయిలిష్ బ్యాట్స్ మన్, భారత మాజీ కెప్టెన్ మన్సూర్ ఆలీ ఖాన్ పటౌడీలను వరించింది. భారత క్రికెట్ రంగానికి ఆద్యుడైన సి.కె. నాయుడి పేరిట ఏర్పాటు చేసిన ఈ అవార్డు కింద జ్ఞాపికతో పాటు రెండు లక్షల రూపాయల నగదును బహూకరిస్తారు. భారత క్రికెట్ రంగానికి ఎనలేని సేవలందించిన ప్రముఖులను ఈ అవార్డుకు ఎంపిక చేయడం ఆనవాయితీగా వస్తున్నది. బిసిసిఐ ప్రముఖులతో కూడిన బోర్టు శనివారం గుప్తే, పటౌడీలను సి.కె. నాయుడు అవార్డుకు ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించింది.
1950 నుంచి 60 వరకు లెగ్ స్పిన్నర్ గా భారత్ క్రికెట్ అద్భుతమైనసేవలందించిన సుభాష్ గుప్తే కేవలం 36 టెస్టుల్లో 149వికెట్లు తీసుకొని రికార్డు సృష్టించారు. ఆ తరువాత ట్రినిడాడ్ కు వలసపోయిన గుప్తే ప్రస్తుతం వెస్టిండీస్ లో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.
ఇక టైగర్ పటౌడీ భారత్ క్రికెట్ జట్టుకు కొత్తరూపు ఇచ్చి ఎనలేనిసేవలు చేశారు. 46 టెస్టుల్లో 2793 పరుగులు చేయడంతో పాటు భారత్ జట్టును అత్యుత్తమ జట్టుగా తీర్చిదిద్దడంలో ఎంతో కృషి చేశారు. ప్రపంచ అత్యుత్తమ బ్యాట్సె మెన్ కు సైతం చెమటలు పట్టించగల ప్రసన్న, బిషన్ సింగ్ బేడి వెంకటరాఘవన్ వంటి మేటి స్పిన్నర్లను పటౌడీ వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఓ కారు ప్రమాదంలో పటౌడీ కన్ను పోయింది. ఆ లోపాన్ని లక్ష్యపెట్టకుండా భారత్ క్రికెట్ కు ఆయన ఎనలేనిసేవలు చేశారు. పటౌడీ సతీమణి ప్రముఖ నటీమణి షర్మిలా టాగూర్ కాగా వారి కుమారుడు ప్రస్తుత హిందీ హీరో సయీఫ్ ఆలీఖాన్.












Click it and Unblock the Notifications