చారిత్రక తప్పిదాలకు యూరప్ క్షమాపణ
డర్బన్‌ః జాతి వివక్షకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు శుక్రవారం నాడు ముగిసింది. ఒకప్పుడు వలసవాదంతో ఎన్నో దేశాల్లో అధిపత్యం చెలాయించడం, ఎందర్నో బానిసలుగా మార్చడం వంటి చారిత్రక తప్పిదాలకు సదస్సు తుది డిక్లరేషన్‌లో క్షమాపణలు చెప్పడానికి యూరప్ సమాజం అంగీకరించింది.
ఐక్యరాజ్య సమితి ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ సదస్సు ఆరంభం నుంచి రకరకాల వివాదాల్లో కూరుకుపోయిన విషయం విదితమే. సదస్సు విఫలం కాకుండా చివరినిమిషం వరకు నిర్వాహకులు శతప్రయత్నాలు చేయాల్సివచ్చింది. పశ్చిమాసియా వివాదం కారణంగా అసాధారణ రీతిలో సదస్సును శనివారం వరకు పొడిగించారు. శుక్రవారం నాడే ముగియాల్సివున్నప్పటికీ సదస్సు తుది తీర్మానంపై ఏకాభిప్రాయ సాధనకోసం ఈ చర్య తీసుకున్నారు.
యూదువాదాన్ని జాతివివక్షతో సమానంగా గుర్తించాలన్ని డిమాండ్ ఒకవైపు, యూదులపై నాజీలు సాగించిన నరమేధం గురించిన ప్రస్తావన మరోవైపు సదస్సులో వివాదాన్ని సృష్టించింది. అంతూ పొంతూ లేని వాదనలు... ఎంతకీ తెగని చర్చలతో వారు తమ సమస్యలను సదస్సు దృష్టికి తీసుకురావలని ప్రయత్నించిన అనేక మైనార్టీ గ్రూప్‌లు నిరాశతో తిరుగుముఖం పట్టాయి. ఇదిలా వుండగా భారత్‌కు సంబంధించినంత వరకు ఈ సదస్సు సఫలమైందని కులవివక్షతను అంతర్జాతీయ దృష్టికి తీసుకురావడానికి డర్బన్ వెళ్లిన భారత దళిత సంఘాల ప్రతినిధు అంటున్నారు. భారత ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ తాము ఈ సమస్యను డర్బన్‌లో ప్రస్తావించగలిగినట్టుగా వారు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications