మలేసియాలో సత్యం డెవలప్‌మెంట్‌సెంటర్
కౌలాలంపూర్‌ః హైదరాబాద్‌కు చెందిన సత్యం కంప్యూటర్ సర్వీసెస్ మలేసియాలో ఏర్పాటు చేస్తున్న మల్టీ మీడియా సూపర్ కారిడార్‌లో ఆగ్నేయాసియా డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నది. ప్రస్తుతం మలేసియా పర్యటనలో వున్న సత్యం ఎండి రామరాజు ఈ విషయం చెప్పారు.
మల్టీమీడియా డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో చర్చిస్తున్నామని త్వరలోనే ఒక నిర్ణయానికి రాగలమని ఆయన వెల్లడించారు. సింగపూర్‌లో ఇప్పటికే సత్యం కార్యాలయం వుంది. ప్రస్తుతం తమ రాబడిలో అత్యధికంగా అమెరికా నుంచే వస్తున్నదని అయితే ఇతర ప్రాంతాల్లోకి కూడా పెద్దఎత్తున చొచ్చుకుపోవడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు.
మలేసియాలో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ వ్యయం తక్కువైన కారణంగా అక్కడ కూడా తాము దృష్టి కేంద్రీకరిస్తున్నట్టుగా ఆయన వెల్లడించారు.మలేసియా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మల్టీమీడియా సూపర్ కారిడార్‌లో 15 బహుళజాతి కంపెనీలతో సహా 500 కంపెనీలు తమ కార్యకలాపాలను నిర్వహించేందుకు ముందుకువచ్చాయి.












Click it and Unblock the Notifications