సుప్రీంలో ఆంధ్ర, కర్నాటక డీ
హైదరాబాద్‌ః రాష్ట్రంలో కృష్ణానదిపై చేపడుతున్న ప్రాజెక్టులకు కర్నాటక ప్రభుత్వం మోకాలడ్డడంపై సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని అంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈవిషయంపై శనివారం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వం తీసుకొనే అన్ని చర్యలకు మద్దతు ఇస్తామని ప్రతిపక్షాలు ముక్తకంఠంతో చెప్పాయి. ఆంధ్రప్రదేశ్ కృష్ణానదిపై చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులను నిలిపివేయాల్సిందిగా కోరుతూ కర్నాటక ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈఅంశంపై నాలుగువారాల్లోగా సమాధానం ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది.
కీలకమైన ఈ వ్యవహారంపై రాష్ట్రంలోని అన్నిపార్టీల అభిప్రాయాలను తెలుసుకొనేందుకు ప్రభుత్వం శనివారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. బచావత్ అవార్డు ప్రకారం నడుచుకుంటున్నప్పటికీ కర్నాటక ప్రభుత్వం ఈవిషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నదని, కర్నాటక వైఖరిని సుప్రీంకోర్టులో సవాల్ చేయాలనే ప్రభుత్వ నిర్ణయానికి ప్రతిపక్షాలు మద్దతునిచ్చాయి. కృష్ణానదిపై చేపడుతున్న ఎస్.ఆర్.ఇ.సి., బీమా, పులిచింతల, ఎస్.ఎల్.బి.సి., తెలుగుగంగ ప్రాజెక్టులు నిబంధనలకువిరుద్ధంగా వున్నాయనేది కర్నాటక ప్రభుత్వం వాదన.
అయితే తాము బచావత్ అవార్డు ప్రకారమే నడుచుకుంటున్నట్లు ప్రభుత్వం వాదిస్తున్నది. మౌనంగా ఊరుకున్న కారణంగానే కర్నాటక సుప్రీంకోర్టున ఆశ్రయించిందని అఖిలపక్షం అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగపడే ఈ ప్రాజెక్టులవిషయంలో ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా అందుకు పూర్తి మద్దతు వుంటుందని అఖిలపక్ష నేతలు వెల్లడించారు. ఎస్.ఎల్.బి.సి, తెలుగుగంగ ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా డిమాండ్ చేసింది.












Click it and Unblock the Notifications