నాలుగేళ్లలో సంపూర్ణ అక్షరాస్యత
హైదరాబాద్‌ః మరో నాలుగేళ్లలో రాష్ట్రంలో సంపూర్ణ అక్షరాస్యతను సాధించడం ఖాయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.
35వ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన శునివారం నాడుఅందరికీ చదువు, అందరికీ బాధ్యత పేరుతో ఏర్పాటు చేసిన సదస్సులో ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో అక్షరాస్యత 61 శాతం వున్నదని ముఖ్యమంత్రి చెప్పారు. 2005 సంవత్సరం నాటికి 100 శాతం అక్షరాస్యతను సాధించడం ఖాయమని వెల్లడించారు.
చదువుకోవడం వల్లనే సంపదనుపెంచుకోవచ్చని, పేదరికాన్ని నిర్మూలించవచ్చని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రభుత్వ చేపట్టే వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందాలన్నా చదువు అవసరమని ఆయన అన్నారు. చదువుకోవాలనే తపన రావాలని అప్పుడే సంపూర్ణ అక్షరాస్యత సాధనవిషయంలో ప్రభుత్వం లక్ష్యం సిద్ధిస్తుందని ఆయన అన్నారు. ఈ సదస్సులో ఆయన అక్షరాస్యత ప్రతిజ్ఞ చేయించారు. అక్షరాస్యత కోసం ఏర్పాటైన సంఘాలు తాము సాధించినపురోగతిని వివరించాయి.
- మహిళలకు సారీ చెప్పిన చంద్రబాబు












Click it and Unblock the Notifications