ప్రమాదం నుంచి బయటపడ్డ రాజ్ నాధ్
లక్నోః ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి రాజ్ నాధ్ సింగ్ తృటిలో ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. రాజ్ నాధ్ సింగ్ శనివారం తన నివాసంలో 500 మంది కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా అక్కడ విసిన శామియానా ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే ముఖ్యమంత్రి రక్షణ సిబ్బంది రాజ్ నాధ్ ను సకాలంలో శామియానా నుంచి బయటకు తీసుకురావడంతో ఆయన ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడాల్సి వుండడంతో రాజ్ నాధ్ నివాసంలోనే శామియానా ఏర్పాటు చేశారు.
రాజ్ నాధ్ తన నివాసం నుంచి శామియానాలోకి రాగానే భారీ వర్షం కురిసింది. వర్షం తీవ్రతకు శామియానా ఒక్కసారిగా కుప్పకూలింది. దీనితో కార్యకర్తలు హాహాకారాలు చేశారు. అయితే భద్రతా సిబ్బంది రాజ్ నాథ్ ను సురక్షితంగా శామియానా నుంచి బయటకు తీసుకువెళ్ళగలిగారు. శామియానా కూలిన సంఘటనలో కొందరు కార్యకర్తలుస్వల్పంగా గాయపడ్డారు.












Click it and Unblock the Notifications