దేవాలయ భూముల బహిరంగవేలం
హైదరాబాద్‌ః రాష్ట్రంలో వివిధ ఆలయాల కింద వున్న సుమారు నాలుగు లక్షల ఎకరాల భూములను బహిరంగ వేలం ద్వారావిక్రయించనున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు వెల్లడించారు. శనివారం హైదరాబాద్ లో ఆయనవిలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటి వరకు దేవాలయ భూముల్లోసేద్యం చేసుకుంటున్న నిరుపేదలకు ప్రాధాన్యం ఇస్తామని వారికి 25 శాతం రాయితీ కూడా ఇస్తామని మంత్రి వెల్లడించారు.
దేవాలయాలకు చెందిన లక్షలాది ఎకరాలు నామమాత్ర మొత్తంలో లీజుకు తీసుకొని కొందరు దశాబ్దాలుగా ఆ ఆస్తులను అనుభవిస్తున్నారని మంత్రి చెప్పారు. గతంలో తీసుకున్న లీజులన్నింటినీ రద్దు చేస్తామని మంత్రి చెప్పారు. జంటనగరాలు, పట్టణాలలో కబ్జాకుగురైన దేవాలయాల భూములపై సర్వే నిర్వహిస్తున్నామని మంత్రివివరించారు.












Click it and Unblock the Notifications