అలిగిన ఎంపిలను ఊరడించిన వాజ్‌పేయి

న్యూఢిల్లీః కేంద్ర క్యాబినెట్‌విస్తరణలో తమకు అన్యాయం జరిగిందంటూ అలక పూనిన బిజెపి ఎంపిలను ప్రధాని వాజ్‌పేయి సముదాయించారు. తమకు అన్యాయం జరిగిందంటూ బిజెపి ఎం.పి.లు మదన్‌ లాల్‌ ఖురానా,విజయ్‌ కుమార్‌ మల్హోత్రా, సాహిబ్‌ సింగ్‌ వర్మ, లాల్‌బిహారి తివారిలు శనివారం మధ్యాహ్నం ప్రధాని వాజ్‌పేయిని కలుసుకున్నారు.

గంటసేపటికిపైగా నలుగురు ఎం.పి.లు ప్రధానితో మంతనాలు జరిపారు. అనంతరం వారువిలేకరులతో మాట్లాడుతూ తమకు న్యాయం చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారని చెప్పారు. ప్రధాని హామీతో సంతృప్తి చెందినట్లు వారివివరించారు. ఈ నలుగురు ఎం.పి.లు బిజెపి అధ్యక్షుడు జానా కృష్ణమూర్తిని కూడా కలుసుకొని తమకు జరిగిన అన్యాయాన్నివివరించారు. అయితే కృష్ణమూర్తి, ప్రధానితో జరిగిన సమావేశంవివరాలను వెల్లడించేందుకు వారు నిరాకరించారు.

పార్టీపై అలిగి అన్ని పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధపడిన నలుగురుసీనియర్‌ ఎం.పి.ల వ్యవహారం బిజెపిలో కొంత అలజడి రేకెత్తించింది. అయితే వాజ్‌పేయి వెంటనే స్పందించి సమస్యను కొంత వరకు పరిష్కరించగలిగారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+