క్రికెట్: భారత్ గెలిచింది!
సెంచూరియన్ పార్క్: దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన డే అండ్ నైట్ వన్డే క్రికెట్ మ్యాచ్‌లో భారత్‌విజయం సాధించింది. స్పిన్నర్ల చలువతో భారత్‌విజయాన్ని చేజిక్కించుకుంది. హర్బజన్ సింగ్ మూడు కీలకమైనవికెట్లు పడగొట్టి భారత్ విజయానికి విజయానికి బాటలు వేశాడు. కుంబ్లే రెండు వికెట్లు, షెహవాగ్ రెండు వికెట్లు తీసుకున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 48.5 ఓవర్లలో 233 పరుగులు చేసి ఆల్‌అవుట్ అయింది.
మొదట భారత ఓపెనర్లు సౌరబ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్ ఆచితూచి ఆడారు. ఆ తర్వాత కొద్ది సేపటికే గంగూలీ విజృంభించి పొలాక్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు కొట్టాడు. దీంతో భారత్ స్కోర్ వేగంగా పెరిగింది. అయితే పొలాక్ వేసినతొమ్మిదో ఓవర్‌లో గంగూలీ అంపైర్ తప్పుడు నిర్ణాయనికి పెవిలియన్ దారి పట్టాల్సి వచ్చింది. కలిస్ జారవిడిచిన క్యాచ్‌ను తప్పుగా అర్థం చేసుకుని అంపైర్ అవుట్ ఇచ్చాడు. ద్రావిడ్, యువరాజ్ సింగ్‌ల భాగస్వామ్యం భారత్ స్కోర్‌కు బలం చేకూర్చింది.
ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 106 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే, లాన్స్ క్లుసెనర్, బౌచర్‌లు పట్టుదలతో ఎదురీది భారత్ విజయాన్ని ఆలస్యం చేశారు.వీరిద్దరూ ఎనిమిదో వికెట్‌కు 77 పరుగులు జోడించారు. బౌచర్‌ను షెహవాగ్ క్లీన్‌బౌల్డ్ చేయడంతో ఈ భాగస్వామ్యం విడిపోయింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా ఓడిపోవడానికి ఎంతో సమయం పట్టలేదు.












Click it and Unblock the Notifications