హైదరాబాద్‌ః ఆర్టీసీ సమ్మెను పరిష్కరించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ప్రజలే సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అన్ని అభివృద్ధి పథకాలను త్వరలో పునః పరిశీలించనున్నట్లు సోమవారం జరిగిన తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యనిర్వాహకుల సమావేశంలో ఆయన చెప్పారు. ఆర్టీసీ వ్యవహారంలో ప్రజలు త్యాగాలకు సైతం సిద్ధంగా వుండలని చంద్రబాబు కోరడం గమనార్హం.

సమ్మెను ఆపేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నదని బాబు తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న చర్యలను సమర్థించడం ద్వారా ప్రజలు పూర్తి సహకారాన్నిఅందించాలని, అవసరమైతే త్యాగాలకు సిద్ధం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ నేతలు ప్రజల్లో ఈ మేరకు అవగాహన కల్పించాలని కూడా ఆయనకోరారు. 20 రోజులుగా నడుస్తున్న ఆర్టీసీ సమ్మెను పరిష్కరించడంలో ప్రభుత్వం చతికిలపడిన సంగతి తెలిసింది. ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణల నేపధ్యంలో ప్రజలు త్యాగాలకు సిద్ధం కావాలని పిలుపునివ్వడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+