బ్లోయెమ్ ఫోంటెన్‌ః దక్షిణాఫ్రికాపై జరుగుతున్న తొలిటెస్ట్ మూడో రోజును భారత్ బౌలర్లపై సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్ ఆధిక్యం సాధించారు. 563 పరుగులు భారీ స్కోరు సాధించిన తరువాత సౌతాఫ్రికా ఆలౌట్‌అయింది. దీనితో భారత్ పై సౌతాఫ్రికాకు 184 పరుగులు ఆధిక్యం లభించింది. 327 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టు జోరుగా ఆడింది. కెల్లిస్ 68 పరుగులు, క్లూసెనర్ 108 పరుగులు వేగంగా సాధించడతో సౌతాఫ్రికా భారీ స్కోరు సాధించగలిగింది.
భారత బౌలర్లలో పాతకాపు శ్రీనాధ్ భారత్ ను ఆదుకున్నాడు. శ్రీనాధ్ కు ఐదు, కుంబ్లేకు 5, ఆశిష్ నెహ్రా ఇద్దరు బ్యాట్స్ మెన్ ను ఇంటిదారి పట్టించారు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ పాజిటివ్‌గేమ్ ప్రారంభించింది. తొలి ఓవర్ లోనే 12 పరుగులు సాధించి శుభారంభంపలికింది.
అయితే ఆ తరువాత రెండంకెల స్కోరు సాధించకుండానే ద్రాడ్ అవుటయ్యాడు. బలవంతంగా ద్రాడ్ ను ఓపెనర్ గా బరిలోకి దించినందుకు భారత్ గట్టిగానే మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. రెండు ఇన్నింగ్స్ లలో ద్రాడ్ ఫలం అయిన షయం దితమే. ఆ తరువాత దాస్, లక్ష్మణ్ నిలకడగా ఆడడం ప్రారంభించారు. నిలదొక్కుకోవడానికి చాలా సమయం తీసుకున్న లక్ష్మణ్ ఆ తరువాత సహజ శైలిలో ఆడాడు. దాస్ మెల్లిగా ఆడుతూ, dలు దొరికినప్పుడు బౌండరీలు సాధిస్తూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు.












Click it and Unblock the Notifications