న్యూఢిల్లీః భారత్ కు రక్షణ సరఫరాలను పునరుద్ధరించేందుకు అమెరికాఅంగీకరించింది. అమెరికా రక్షణ శాఖ మంత్రి రమ్స్‌ఫీల్డ్ సోమవారం నాడు భారత్ రక్షణ శాఖ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ తో జరిపిన చర్చల సందర్భంగా ఈ మేరకు ఓఅంగీకారం కుదిరింది. బారత్ తన రక్షణ అవసరాలను పంపితే వాటిని సరఫరా చేసేఅంశాన్ని పరిశీలిస్తామని రమ్స్ ఫీల్డ్ చెప్పినట్లు భారత రక్షణ శాఖ అధికారులు చెప్పారు.
జార్జి ఫెర్నాండెజ్ తో రెండు గంటల పాటు జరిగిన చర్చల సందర్భంగా రక్షణ రంగానికి చెందిన ధఅంశాలు ప్రస్తావనకు వచ్చాయి. భారత్ - అమెరికా రక్షణ వ్యూహరచన బృందానికి మరింత పదునుపెట్టాలని ఉభయ దేశాలు నిర్ణయించాయి. భారత్ 1998లో అణుపరీక్షల నిర్వహించిన దరిులా అమెరికా రక్షణపరమైన ఆంక్షలు ధించింది.
ఈ ఆంక్షలను తొలగించాల్సిందిగా జార్జి అమెరికాకు జ్ఞప్తి చేశారు. కాశ్మీర్, చైనా, పాకిస్తాన్, నేపాల్ తదితరఅంశాలపై ఫెర్నాండెజ్, రమ్స్ ఫీల్డ్ చర్చలు జరిపారు. ులటరీ వ్యవహారాలలో ఉభయ దేశాలు మరింతగా సహకరించుకొనేందుకు అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి డగ్లస్ ఫెయిత్ త్వరలో భారత్ పర్యటిస్తారని రక్షణ శాఖ అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications