హైదరాబాద్‌ః ముంబాయి మాఫియా ముఠానాయకుడు చోటాషకీల్ కుడిభుజంగా చెబుతున్న కిరాయి హంతకుడు హనీఫ్ అలియాస్ యాున్ తెహల్కా(40) నగరంలో ఆదివారం నాడు పోలీసులతో జరిగినఎన్‌కౌంటర్‌లో మరణించాడు.
హైదరాబాద్‌ః ముంబాయి మాఫియా ముఠానాయకుడు చోటాషకీల్ కుడిభుజంగా చెబుతున్న కిరాయి హంతకుడు హనీఫ్ అలియాస్ యాున్ తెహల్కా(40) నగరంలో ఆదివారం నాడు పోలీసులతో జరిగినఎన్‌కౌంటర్‌లో మరణించాడు.
సంచలనం సృష్టించిన ఈ సంఘటన కులీకుత్‌బ్‌షాహి టూంబ్స్ వద్ద జరిగింది. పోలీసులకు ఇన్‌ఫార్మర్ల నుంచిఅందిన సమాచారం మేరకు హనీఫ్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించగా ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్టుగా పోలీసులు కుషనర్ రాములు చెప్పారు.
ఇద్దరు వ్యక్తులు నగరానికి అక్రమంగా ఆయుధాలు తరలిస్తున్నట్టుగాఅందిన సమాచారం మేరకు గోల్కొండ టోంబ్స్ వద్దటాస్క్‌ఫోర్స్ పోలీసులు కాపలావున్నారు. ఆదివారం వేకువ జామున 3 గంటల ప్రాంతంలో నెంబర్‌లేని స్కూటర్‌పై ఇద్దరు వ్యక్తులు రావడం గమనించిన పోలీసులు వారిని ఆపడానికి ప్రయత్నించగా వెనకకూచున్న వ్యక్తి చేతిలో బ్యాగుతో సహా దిగి పక్కనున్న పొదల్లోకి పారిపోయాడని స్కూటర్ నడుపుతున్న వ్యక్తి టోలిచౌక్ వైపుగా వెళ్లిపోయాడని కుషనర్ వరించారు. పొదల్లోకి పారిపోయిన వ్యక్తిని పోలీసులు వెంటాడగా ఆ వ్యక్తి కాల్పులు జరిపాడని దానితో పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరపడంతో సదరు వ్యక్తి మృతిచెందాడనిపేర్వారం రాములు వరించారు. మృతుని వద్ద ఆయుధాలు, బాంబులు దొరికాయి. మృతున్ని హనీఫ్‌గా గుర్తించిన తర్వాత ముంబాయి పోలీసులను సంప్రదించగా అతను కరుడుకట్టిన నేరగాడని కిరాయి హంతుకుడని గతఅయిదేళ్లుగా పోలీసులు గాలిస్తున్నారని వెల్లడయినట్టుగా ఆయన చెప్పారు. మహారాష్ట్రకు చెందిన హనీఫ్ గత ఆరునెల్లుగా హైదరాబాద్‌లో వుంటున్నట్టుగా పోలీసులు చెప్పారు.అక్బర్‌బాగ్‌లోని హనీఫ్ ఇంటిపై దాడి చేసి అక్కడినుంచి కూడా కొన్ని ఆయుధాలుస్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications