న్యూఢిల్లీః రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ను నవంబర్ 26 లోగా లొంగిపోవలసిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. దాణా కుంభకోణానికి సంబంధించి ఈ నెల 26 లోగా రాంచి ప్రత్యేక కోర్టు ఎదుట లొంగిపోవాల్సిందిగా సుప్రీంకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది.
జస్టిస్ ధామస్, జస్టిస్ ఖాద్రి, జస్టిస్ బెనర్జీలతో కూడాన ముగ్గురు సభ్యులు బెంచ్ లాలూ బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నా దానిని ఆమోదించవద్దంటూ రాంచి ప్రత్యేక కోర్టును కోరింది. లాలూపై గతంలో నాన్ బెయిలబుల్‌అరెస్టు వారెంట్ జారీ అయినందున నవంబర్ 26 లోగా లాలూ లొంగిపోయేందుకు వస్తే ఆయననుఅరెస్టు చేయరాదని కూడా సుప్రీంకోర్టు సిబిఐ నిఆదేశించింది.
లొంగిపోతాః లాలూ
ఈ నెల 26న రాంచీ కోర్టు ఎదుట లొంగపోనున్నట్లు లాలూ ప్రసాద్ యాదవ్ వెల్లడించారు. కోర్టు తీర్పును శిరసావహిస్తానని ఆయన చెప్పారు. ఈ నెల 26 న కోర్టులో లొంగిపోయి అదే రోజున బెయిలుకు దరఖాస్తు చేసుకుంటానని లాలూ చెప్పారు.












Click it and Unblock the Notifications