మాస్కోః భారత ప్రధాని అటల్‌బిహారీ వాజ్ పేయి సోమవారం నాడు మాస్కో చేరుకున్నారు. మంగళవారం నాడు ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్ తో కీలకమైన చర్చలు జరుపుతారు. రష్యా చేరుకున్న ప్రధాని వాజ్‌పేయికి మాస్కో ఎయిర్ పోర్ట్ లో రష్యా ప్రధాని మైఖేల్ కసినోవ్‌స్వాగతం పలికారు. సీనియర్ భద్రతాదళాల అధికారులు, రష్యా మంత్రులు వాజ్‌పేయికి స్వాగతం పలికిన వారిలో వున్నారు. ఈ సందర్భంగా వాజ్‌పేయి రష్యా సేనల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
ఆ తరువాత వాజ్‌పేయి రష్యా దిగువసభ స్పీకర్ జెన్నడె సిలిజ్నోవ్, ఇతర పార్లమెంటు నేతలతో చర్చలు జరిపారు. ఆఫ్ఘనిస్తాన్ పై అమెరికా యుద్ధం నేపధ్యంలో వాజ్‌పేయి, పుతిన్ చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ఉద్రవాదంపై యుద్ధం గురించి కూడా ఉభయ నేతలు చర్చలు జరుపుతారు.












Click it and Unblock the Notifications