న్యూఢిల్లీః పాకిస్తాన్ దగ్గర వున్న అణ్వాస్త్రాలు సురక్షితంగా వున్నాయనిఉగ్రవాదుల చేతుల్లోకి ఈ ఆయుధాలు వెళ్లే అవకాశం లేదని అమెరికా రక్షణ మంత్రి డోనాల్డ్ రమ్స్‌ఫీల్డ్ చెప్పారు. సోమవారం నాడు భారత రక్షణ మంత్రి జార్జ్‌ఫెర్నాండెజ్‌తో కలసి ఆయన సంయుక్త లేకరుల సమావేశంలో పాల్గొన్నారు.
అఎn్గాన్‌పై నెలరోజులుగా కొనసాగుతున్న దాడుల గురించి ప్రశ్నించగా ఉగ్రవాదుల పీచమణచడానికి ఇదే మార్గమని ఆయన తెలిపారు. జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదుల షయంలో అమెరికా అనాసక్తి గురించి ఒక లేకరి ప్రశ్నించగా, టెర్రరిజం అంతర్జాతీయ సమస్య అని టెర్రరిజాన్ని తుదముట్టించేందుకు తాము ఎక్కుపెట్టిన పోరులోఅఎn్గానిస్తాన్ కేవలం మొదటి దశ మాత్రమేనని ఆయన చెప్పారు. భారత్‌పై గతంలో ధించిన ఆంక్షల్లో ఆర్ధికపరమైన వాటిని ఎత్తివేయడం జరిగిందని ఆయన వెల్లడించారు.
అణుపరిజ్ఞానం, హైటెక్ ఆయుధాలకు సంబంధించిన ఆంక్షలపై చర్చ జరుగుతున్నదని ఆయన వెల్లడించారు. చర్చల కొనసాగింపునకు భారత రక్షణ మంత్రిని అమెరికాకు ఆహ్వానించినట్టుగా ఆయన వెల్లడించారు. అంతకు ముందు ఆయన జార్జ్‌తో ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడారు. ఈ చర్చల్లో ద్వైపాక్షికఅంశాలతో పాటు అఎn్గాన్ యుద్ధం ప్రధానంగా చర్చకు వచ్చింది. భారత్‌కు హైటెక్ ఆయుధాల క్రయంపై వున్న ఆంక్షలను తొలిగించాలని జార్జ్‌కోరారు.
ఇదిలా వుండగా తాలిబన్ అనుకూల శక్తులు తిరుగుబాటు చేసి పాకిస్తాన్ నేత ముషారఫ్‌ను పదdచ్యుతున్ని చేసిన పక్షంలో అమెరికన్ బలగాలు జోక్యం చేసుకుని అణ్వాస్త్రాలను కాపాడే అవకాశం వున్నదని అమెరికన్ పత్రికలుపేర్కొన్నాయి.












Click it and Unblock the Notifications