న్యూఢిల్లీః అమెరికా రక్షణ మంత్రి డోనాల్డ్ రమ్స్‌ఫీల్డ్ భారత నేతలతో చర్చలకు ఢిల్లీ చేరుకున్నారు.
అఎn్గానిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం కూల్చివేతకు అమెరికా సాగిస్తున్న యుద్ధానికి అంతర్జాతీయ మద్దతు సాధించడం కోసం చేపట్టినఅయిదు దేశాల పర్యటనలో భాగంగా ఆయన ఢిల్లీ చేరుకున్నారు. భారత రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్‌తో చర్చల అనంతరం ఆయన తిరిగి వాషింగ్టన్ బయలుదేరి వెళ్తారు.
ప్రస్తుతం అమెరికా సాగిస్తున్న దాడులను దృష్టిలో వుంచుకుని పాకిస్తాన్‌తో కొంచెం మెతగ్గా వుండాల్సిందిగా భారత్‌ను అమెరికా కోరుతున్నది. అమెరికా యుద్ధాన్ని ఆసరాగా తీసుకుని పాకిస్తాన్ కేంద్రంగా కాశ్మీర్‌లో అలజడి సృష్టిస్తున్న ఉగ్రవాదుల భరతం పట్టాలని భారత్ యోచిస్తున్నట్టుగా వార్తలు వస్తున్న షయం దితమే. ఈ సమయంలో భారత్ ఏ మాత్రం దూకుడుగా వ్యవహరించినాఅసలుకే మోసం వస్తుందనే ఆందోళన అమెరికాలో వుంది.












Click it and Unblock the Notifications