న్యూఢిల్లీః ప్రపంచవ్యాప్తంగా వున్న ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు అమెరికా కృతనిశ్చయంతో వున్నదని, అయితే ఆఫ్ఘనిస్తాన్ లో ప్రారంభించిన ఉగ్రవాదంపై యుద్ధం ప్రస్తుతానికి ప్రధానాంశమని అమెరికా స్పష్టం చేసింది. అమెరికా రక్షణ శాఖ మంతి రోనాల్డ్ రమ్స్‌ఫీల్డ్ సోమవారం నాడు భారతదేశం సందర్శించారు. ఆఫ్ఘనిస్తాన్ పై సాగిస్తున్న పోరాటానికి మద్దతు కూడగట్టడంలో భాగంగా రమ్స్‌ఫీల్డ్ ధ ఆసియా దేశాలలో పర్యటిస్తున్నారు. ఆ పర్యటనలో భాగంగా ఆదివారం పాక్ లో పర్యటించిన రమ్స్‌ఫీల్డ్ సోమవారం న్యూఢిల్లీ వచ్చారు. రెండుగంటల పాటు భారత రక్షణ శాఖ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ తో చర్చలు జరిపిన రమ్స్‌ఫీల్డ్ ఆ తరువాత లేకరులతో మాట్లాడారు.
జమ్మూకాశ్మీర్ లో పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదం గురించి లేకరులు ఈ సందర్భంగా ప్రస్తాంచగా ఆఫ్ఘనిస్తాన్ పై జరుపుతున్న పోరాటానికంటే ఇదిపెద్ద పోరాటం అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి సంబంధించి ఎన్నో సమస్యలు వున్నాయి. అయితే ఆఫ్ఘనిస్తాన్ తక్షణ సమస్య. అంతర్జాతీయ తీవ్రవాది ఒసామాబిన్ లాడెన్ అంతు చూడడం మా ప్రధాన లక్ష్యం అని రమ్స్‌ఫీల్డ్ వ్యాఖ్యానించారు.
ఉగ్రవాదంపై పోరాటమే అమెరికా ప్రధాన లక్ష్యమని ఆయన వరించారు. కేవలం ఆత్మరక్షణ కోసమే అమెరికా ఆఫ్ఘనిస్తాన్ పై పోరాటం సాగిస్తున్నదని రమ్స్‌ఫీల్డ్ చెప్పారు. ఉగ్రవాదం ఎక్కడ వున్నా నిర్మూలించాలన్నదే అమెరికా అభిమతం అన్నారు.












Click it and Unblock the Notifications