మత తీవ్రవాదమే ఇప్పటి ముప్పు
సెయింట్ పీటర్స్‌బర్గ్‌ః మతతీవ్రవాదమే మానవాళి ఎదుర్కుంటున్న తాజా సమస్య అని భారత ప్రధాని వాజ్‌పేయి చెప్పారు. ప్రపంచశాంతికి, సుస్థిరతకు, నాగరికతకు ఘాతం కలిగిస్తున్న అసలు అంశం ఇదేననిఆయన వెల్లడించారు. మతతీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచదేశాలు చేతులు కలపాలని ఆయన సూచించారు.
మూడు దేశాల్లో పదిరోజుల అధికార పర్యటనలో భాగంగా ఆదివారం నాడు ఇక్కడకు చేరిన వాజ్‌పేయి సోమవారం నాడు రష్యాకు చెందిన మేధావులు, సిద్ధాంతవేత్తల సమావేశంలో మాట్లాడారు.సెప్టెంబర్ 11న అమెరికాపై జరిగిన టెర్రరిస్టుల దాడి తర్వాత ఈ మత తీవ్రవాదంపైశాచిక రూపాన్ని ప్రపంచ గ్రహించిందని ఆయన చెప్పారు.
రష్యాలో నాలుగురోజుల పర్యటనకు ఆదివారం నాడు ఇక్కడకు చేరిన వాజ్‌పేయికి ఘనస్వాగతం లభించింది.












Click it and Unblock the Notifications