వైఎస్‌తో గొడవలులేవు
హైదరాబాద్‌ః సిఎల్‌పి నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో తనకు భేదాలు వున్నట్టుగా వచ్చిన వార్తలను పిసిసి నేత సత్యనారాయణరావు తీవ్రంగా ఖండించారు. సిఎల్‌పి నేతతో భేదాలు వుంటే తాను ఇప్పటికే పిసిసి పీఠం వదిలి వుండేవాణ్ణని ఆయన చెప్పారు. డిసిసి నియామకాలపై తలెత్తిన అసంతృప్తికి అర్ధంలేదని ఆయన వ్యాఖ్యానించారు.
కొణతాల రామకృష్ణ, సికె బాబు రాజీనామా వ్యవహారాన్ని ప్రస్తాస్తూ సికె బాబు మర్శలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసంతృప్తితో వుంటే తన కార్యవర్గంలో బాబు వుండాల్సిన అవసరం లేదని సత్యనారాయణరావు స్పష్టం చేశారు. ప్రజల్లో పార్టీకే తప్ప వ్యక్తిగతంగా నాయకులపట్ల ఆరాధన వుండదని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా వుండగా వైఎస్ డిసిసి నియామకాల పట్ల అసంతృప్తి వున్నారంటూ వస్తున్న వార్తలకు బలం చేకూరుస్తూ మంగళ వారం నాడు కొందరు మధ్యవర్తలు పిసిసి నేతతో మంతనాలు జరిపారు. వైఎస్ మనోభావాలను వారు సత్యనారాయణరావుకు
వరించినట్టుగా తెలిసింది.












Click it and Unblock the Notifications
