హోమ్ పేజి
న్యూఢిల్లీః నేపాల్‌లో మావోయిస్టు తీవ్రవాదుల హింసాకాండ దరిమిలా ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించి తీవ్రవాదులపై ఉక్కుపాదంతో అణిచివేసేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఈ పరిణామాలతో ఉభయదేశాల సరిహద్దుల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.
ముఖ్యంగా పశ్చిమబెంగాల్ ప్రభుత్వం తమ పోలీసులు బలగాలను అప్రమత్తం చేసింది. నేపాల్ పోలీసుల గాలింపు చర్యలతో పెద్దసంఖ్యలో మావోయిస్టులు బెంగాల్‌లోకి ప్రవేశించే అవకాశం వున్నదని భావిస్తున్నారు. దాంతో సరిహద్దుల్లో నిఘాను కట్టుదిట్టం చేసినట్టుగా అధికారులు చెప్పారు. ఇదిలా వుండగా నేపాల్‌లో మావోయిస్టుల హింసాకాండ గురించి దరిమిలా ఎమర్జెన్సీ విధించడాన్ని గురించి ఆ దేశ ప్రధాని దూబే భారత ప్రధాని వాజ్‌పేయితో ఫోన్‌లో వివరించారు. ఏ సాయం కావాలన్నా నేపాల్‌కు అందజేయడానికి భారత్ సిద్ధంగా వున్నదని వాజ్‌పేయి హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications
