బోరు బావిలో మృత్యుకోరల్లో బాలుడు
మహబూబ్‌నగర్: ఆటలాడుతూ ప్రమాదవశాత్తు బోరు బావిలో పడిన బాలుడు మృత్యువుతో పోరాడుతున్నాడు. పదేళ్ల పాకాల రామచంద్రయ్య మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి మండలంలోని నాచారం గ్రామ శివార్లలో ఉన్న బోరు బావిలో పడిపోయాడు. గురువారం ఉదయం పది గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది.
కొంత సేపు దాహం వేస్తోందని ఏడ్చి ఆ తర్వాత మాట్లాడడం మానేశాడు. దీంతో అతని తల్లి మొగులమ్మ, తండ్రి ఆశయ్య గుండెలు పగిలేలా రోదిస్తున్నారు.విషయం తెలిసిన ఇరుగుపొరుగు గ్రామాలవారు తండోపతండాలుగా అక్కడికి చేరుకున్నారు.
జిల్లా ఉన్నతాధికారులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. జిల్లా కలెక్టర్‌కె. మధుసూదన రావు, జిల్లా ఎస్‌పి ఎన్. బాలసుబ్రహ్మణ్యం హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. బాలుడిని రక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. అతనికి ప్రాణవాయువునుఅందించేందుకు వైద్య బృందం ఆక్సిజన్ సలిండర్లతో అక్కడికి చేరుకుంది.ఫైర్ స్టేషన్ సిబ్బంది వాహనాలతో వచ్చారు. బోరుకు సమాంతరంగా ఓపెన్ వెల్ తవ్వడానికి ప్రొక్లెయిన్లను, జెసిబీలను రప్పించారు. మైక్, జనరేటర్‌లను ఏర్పాటు చేశారు. బావి కూలిపోకుండా రింగులు వేస్తున్నారు. ఓపెన్ వెల్‌ను తవ్వే పనిని రాత్రిగం. 10.15 నిమిషాలకు
ప్రారంభించారు. ఈ బావి తవ్వడానికి 14 గంటలు పడుతుందనిఅంచనా. అప్పటి వరకు నిర్విరామంగా ఆక్సిజన్ సరఫరా చేస్తామని వైద్యులు చెప్పారు.












Click it and Unblock the Notifications
