మళ్ళీ దౌత్యానికి రెడీః గద్దర్
హైదరాబాద్‌ఃపీపుల్స్ వార్ నక్సలైట్లకు, ప్రభుత్వానికి మధ్య చర్చలు జరిగేందుకు మళ్ళీ మధ్యవర్తిత్వం నిర్వహించేందుకు సిద్ధంగా వున్నట్లు ప్రజాగాయకుడు గద్దర్ స్పష్టం చేశారు. వారంరోజులుగా రాష్ట్రంలో నక్సలైట్లు విజృంభించడంతో వార్ తో చర్చలను పునరుద్ధరించాల్సిందిగా ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతున్నది. దీర్ఘకాలంగా రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న నక్సలైట్లు సమస్య పరిష్కారానికి తలపెట్టిన చర్చలు ఒక దశకు వస్తుండగా హఠాత్తుగా నిలిచిపోయాయి. రాష్ట్రపోలీసుల వైఖరి, నక్సలైట్ల ప్రవర్తన కూడా చర్చలు అర్థాంతరంగా నిలిచిపోవడానికి కారణం అనేవిమర్శలు వచ్చాయి.












Click it and Unblock the Notifications
